Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు.. 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా అడుగులు

భారతదేశంలో థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి.

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు.. 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా అడుగులు
Covid Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 21, 2021 | 9:29 AM

Covid 19 Vaccine: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం టీకా పంపిణీ వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్వదేశంలో తయారైన టీకాలతో పాటు విదేశీ ఐఔషధ సంస్థలకు చెందిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలకు టీకా ఆవశ్యకత పట్ల అవగాహన పెంచేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రజలు, అధికారులు.. ఒకరికొకరు కలసికట్టుగా తెలంగాణాని 100 శాతం వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.

భారతదేశంలో థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. అయితే ఉచిత సార్వత్రిక టీకాల కార్యక్రమం ప్రారంభమైన జూన్ 21 నుంచి టీకా ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. రాబోయే 10-15 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తిచేసిన నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ కాలనీల్లోని ప్రజలకు 100 శాతం వ్యాక్సిన్లు వేయించాలనే లక్ష్యంతో ఆరోగ్య శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి.. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేయించాలని వైద్య, మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ టీకా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని.. అందుకే అదే మిషన్ మోడ్‌లో కోవిడ్ టీకాలు వేయాలని సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. అర్హత ఉండి ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారికి టీకాలు వేసేందుకు కాలనీల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖత చూపుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద క్యూ కట్టి మరీ టీకా తీసుకుంటున్నారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Read Also…. AK103 Rifles: రష్యాతో భారత్‌ కీలక ఒప్పందం.. సైనికుల చేతికి అత్యాధునిక ఆయుధాలు.. ఏకే-103 రైఫిల్స్‌ కొనుగోలు..!