AK103 Rifles: రష్యాతో భారత్‌ కీలక ఒప్పందం.. సైనికుల చేతికి అత్యాధునిక ఆయుధాలు.. ఏకే-103 రైఫిల్స్‌ కొనుగోలు..!

AK103 Rifles: ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు భారత ఆయుధ రంగంలో కనీవిని ఎరుగని రీతిలో కొత్త ఆయుధాలను..

AK103 Rifles: రష్యాతో భారత్‌ కీలక ఒప్పందం.. సైనికుల చేతికి అత్యాధునిక ఆయుధాలు.. ఏకే-103 రైఫిల్స్‌ కొనుగోలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 21, 2021 | 9:20 AM

AK103 Rifles: ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు భారత ఆయుధ రంగంలో కనీవిని ఎరుగని రీతిలో కొత్త ఆయుధాలను తయారు చేసి భారత ఆర్మీకి అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇక ఏకే 103 సిరీస్‌ రైఫిల్స్‌ను రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తోంది. ఇందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సైన్యం గడువు తిరిన, వాడుకలో లేని రైఫిళ్ల స్థానంలో ఈ కొత్త ఆయుధాలను కొనుగోలు చేయనుంది భారత్‌. కాగా, భారత్‌ అక్టోబర్‌ 2017లో భారత సైన్యం దాదాపు ఏడు లక్షల రైఫిల్స్‌, 44,000 రైట్‌ మెషిన్‌ గన్స్‌, దాదాపు 44,600 కార్బైన్లను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. తాజాగా సైన్యానికి అందించడం కోసం భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

రైఫిల్స్‌ తయారీ సంస్థ అయిన ఇండో-రష్యా రైఫిల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన అధికారుల సమక్షంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ రైఫిళ్లను ఈ ఏడాది నవంబర్ నుంచి సైనికులకు అందించనున్నారు. ప్రస్తుతం సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో వినియోగిస్తున్న రైఫిల్స్ స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు. వీటిని ఫ్రంట్ లైన్ పదాతి దళ సైనికులు వినియోగిస్తారు. ఇందులో భాగంగా రష్యా నుంచి 70 వేల ఏకే-103 రైఫిల్స్‌ను కొనుగోలు చేయనుంది.

ఇవీ కూడా చదవండి:

LPG Gas Cylinder Price: పేదల నడ్డి విరుస్తున్న గ్యాస్‌ సిలిండర్ ధరలు.. ఒక సంవత్సరంలో ఎంత పెరిగిందంటే..

Systematic Investment Plan: నెలకు రూ.15 వేల పెట్టుబడితో కోట్లల్లో లాభం.. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎంతో ప్రయోజనం!

SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!