Earthquake: కర్ణాటకలో కంపించిన భూమి.. మూడు సార్లు ప్రకంపనలతో పరుగులు తీసిన జనం
గుల్బర్గా జిల్లా చించోలి తాలూకాలోని పలు గ్రామాల్లో భూమి కంపించింది.
కర్నాటక సరిహద్దు గ్రామాల్లో భూకంపం టెన్షన్ పెట్టించింది. గుల్బర్గా జిల్లా చించోలి తాలూకాలోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. వరుసగా మూడు సార్లు స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కదిలిపోయాయి. ప్రకంపనల ధాటికి కిందపడిపోయాయి. పలు ఇళ్ల గోడలకు బీటలు వారాయి. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు హడలిపోయారు. రాత్రంతా జనం నిద్ర లేకుండా జాగారం చేశారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.