Naxals Attack: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. భద్రతా దళాలపై దాడి.. అసిస్టెంట్ కమాండెంట్‌తో సహా ఇద్దరు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్ దాడికి పాల్పడ్డారు.
Maoist attack in Narayanpur: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి సుందర్‌రాజ్ తెలిపారు. చోటేదోంగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఐటీబీపీ 45వ బెటాలియన్ కడెమెట శిబిరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐటీబీపీ సిబ్బంది కొంతమంది తమ సాధనలో భాగంగా శిబిరానికి 600 మీటర్ల దూరానికి చేరుకున్న సమయంలో నక్సల్స్ బృందం వారిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ షిండే, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గురుముఖ్ సింగ్ అమరులైనుట్ల సుందర్ స్పష్టం చేశారు. వెంటనే ఘటన స్థలానికి అదనపు బలగాలను పంపించామని, అమరుల పార్థివ దేహాలను అక్కడి నుంచి తరలించామని ఆయన పేర్కొన్నారు.