Gold Hallmarking: గోల్డ్ హాల్‌మార్కింగ్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. దేశ వ్యాప్తంగా ఆగస్టు 23న సమ్మె..!
Gold Hallmarking: బంగారం కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని బంగారు అభరణాలకు హాల్ మార్కింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో..
Gold Hallmarking: బంగారం కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని బంగారు అభరణాలకు హాల్ మార్కింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో గోల్డ్ హాల్మార్కింగ్జూన్15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ దీని ప్రకారం.. ఇకపై వ్యాపారులు హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలను విక్రయించడానికి వీలులేదు. ఒకవేళ హాల్‌మార్కింగ్ లేకుండా అభరణాలను విక్రయించినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ కొత్త విధానంపై వ్యాపారుల నుంచి బీఐఎస్‌కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరిచేస్తూ ఏకపక్షంగా విధించిన నిబంధనలకు నిరసనగా ఈనెల 23న ఆభరణాల వర్తకులు సమ్మె చేస్తున్నట్లు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) శుక్రవారం తెలిపింది. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఉన్న 350 అభరణాల సంఘాలు సమ్మెకు మద్దతు ఇస్తున్నాయని తెలిపింది. దేశంలో దశలవారీగా అభరణాలకు హాల్‌మార్కింగ్ విధానం అందుబాటులోకి రాగా, మొదటి దశ అమలు కోసం ప్రభుత్వం 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 256 జిల్లాలను గుర్తించింది. స్వర్ణకారులు కొత్తగా తీసుకువచ్చిన హాల్‌మార్కింగ్ విధానం స్వీకరించలేరని, బంగారం స్వచ్ఛతతో ఎలాంటి సంబంధం లేదని జీజేసీ మాజీ అధ్యక్షుడు అశోక్ మీనావాలా అన్నారు.
హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి..?
మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలో తెలియదు. చాలా మందికి ఒరిజినల్, నకిలీవి అనేవి తెలియవు. కొందరు చూడాగానే గుర్తిస్తారు. బంగారం నాణ్యతను గుర్తించేందుకు మీకు హాల్‌మార్కింగ్ ఉపయోగపడుతుంది. నగల షాపుల్లో కేవలం హాల్‌మార్కింగ్ ఉన్న బంగారు అభరణాలను మాత్రమే అమ్మాలి. హాల్‌మార్కింగ్ లేని నగలు అమ్మడానికి వీలులేదు. అలా అమ్మినట్లయితే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రస్తుతం నగల షాపుల్లో హాల్‌మార్కింగ్ లేని నగలు కూడా లభిస్తున్నాయి.
బంగారం నగలు కొనుగోలు చేసే కొందరు హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా కావాలని అడిగే వారు కూడా ఉన్నారు. అయితే మీరు ఇప్పటికే నగలు కొన్నట్లయితే స్వచ్ఛత గురించి తెలుసుకోవాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తింపు పొందిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఈ సెంటర్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల్లోనూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఈ సెంటర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 40 శాతం మాత్రమే బంగారు అభరణాలు హాల్ మార్క్ నిబంధనలు పాటిస్తున్నారు. ఈ విధానం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.