Disha app: దిశా యాప్‌ ద్వారా పోలీసులు విజయనగరం బాధితురాలిని రక్షించారు : మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స

దిశా యాప్‌ ద్వారా పూసపాటిరేగ మండలం చౌడవాడ బాధితురాలిని పోలీసులు రక్షించారని ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ

Disha app: దిశా యాప్‌ ద్వారా పోలీసులు విజయనగరం బాధితురాలిని రక్షించారు : మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స
Botsa
Follow us

|

Updated on: Aug 20, 2021 | 9:56 PM

Botsa – Pushpa Srivani: దిశా యాప్‌ ద్వారా పూసపాటిరేగ మండలం చౌడవాడ బాధితురాలిని పోలీసులు రక్షించారని ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయనగరం జిల్లాలో ప్రియుడు పెట్రోలు దాడిలో గాయపడిన బాధితురాలిని ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. కాగా హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ దీపికా పాటిల్‌ వెల్లడించారు. దిశ యాప్‌ సమాచారంతో బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించామని బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు.

నిందితుడిపై వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ వేస్తామని, నిందితుడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆమె తెలిపారు.

Read also: alamuru Ladies: పాల‌మూరు మ‌హిళా స‌మాఖ్యల‌ గిన్నీస్ రికార్డ్‌.. అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్