New Smartphones: వెయిటింగ్‌కు ఇక చెక్…. జూన్‌లో లాంచ్ అయ్యే సూపర్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
ముఖ్యంగా టాప్ ఫోన్ బ్రాండ్స్ అయిన వన్ ప్లస్, నథింగ్ రియల్ మీ, మోటోరోలా వంటి టాప్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలను సిద్ధం అవుతున్నాయి. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హై ఎండ్ డివైజ్‌ల యొక్క కొత్త బ్యాచ్ ఈ నెలలో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం నేపథ్యంలో అన్ని బ్రాండ్‌లు తమ పరికరాల్లో అత్యాధునిక ఫీచర్‌లు, కార్యాచరణలను పరిచయం చేయడం ద్వారా మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా టాప్ ఫోన్ బ్రాండ్స్ అయిన వన్ ప్లస్, నథింగ్ రియల్ మీ, మోటోరోలా వంటి టాప్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలను సిద్ధం అవుతున్నాయి. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హై ఎండ్ డివైజ్‌ల యొక్క కొత్త బ్యాచ్ ఈ నెలలో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ (2) నుంచి చాలా కాలంగా ఎదురుచూస్తున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ వరకు ఈనెలలోనే రిలీజ్ అవుతాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో రిలీజ్ అయ్యే సూపర్ స్మార్ట్ ఫోన్ల గురించి ఓ లుక్కేద్దాం.
నథింగ్ ఫోన్ (2)
నథింగ్ ఫోన్ (2) ప్రస్తుతం అత్యంత హైప్ చేసిన మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్ త్వరలో విడుదల కానుందని నిపుణులు అంచనా. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 + జెన్ 1 ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే 8 జీబీ +128 జీబీ వేరియంట్‌లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 4,700 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్ధతునిస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ 3
వన్ ప్లస్ నుంచి వచ్చే తదుపరి మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ నార్డ్ 2టీకు అన్ని విధాలుగా పెద్ద అప్‌గ్రేడ్ చేస్తూ నార్డ్ 3 వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మీడియాటెక్ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ 1.5 కే రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ కూడా ఈ నెలలోనే లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
ఐక్యూ నియో 7 ప్రో
ఐక్యూ నియో 7 ప్రో రాబోయే కొద్ది వారాల్లో భారతదేశంలో లాంచ్ అవుతుందని ధృవీకరిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ద్వారా శక్తిని పొందుది. స్మార్ట్‌ఫోన్ కనీసం 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్ 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతునిస్తుంది.
మోటోరోలా ఎక్స్ 40
మోటోరోలా ఎక్స్ 40 కూడా రాబోయే కొద్ది వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు 6.7 అంగుళాల రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీ 68 రేటింగ్ వంటి లక్షణాలతో వస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ
ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెలలో ఫ్యాన్ ఎడిషన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఎక్సినోస్ 2200 చిప్ సెట్ ఆధారంగా పని చేస్తుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ప్రత్యేక టెలిఫోటో, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ రిలీజ్ నిపుణుల అంచనా. ఈ ఫోన్ కూడా వైర్‌లెస్ ఛార్జింగ్, నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఐపీ రేటింగ్‌తో వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..