New Smartphones: ఏప్రిల్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర.. కిర్రాక్ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రానున్న ఫోన్లు ఇవే
ఇప్పటికే మార్చిలో కొన్ని ఫోన్లు అందుబాటులోకి వచ్చి సేల్స్‌పరంగా దూసుకుపోతున్నాయి. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కూడా కొన్ని కంపెనీలు కొత్త మోడల్ ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
యువత సరికొత్త ఫీచర్స్‌తో వచ్చే స్మార్ట్ ఫోన్లను వాడడానికి ఇష్టపడుతున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా అధిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రతి నెలా సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. ఇప్పటికే మార్చిలో కొన్ని ఫోన్లు అందుబాటులోకి వచ్చి సేల్స్‌పరంగా దూసుకుపోతున్నాయి. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కూడా కొన్ని కంపెనీలు కొత్త మోడల్ ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కేవలం ఫీచర్లపైనే కాకుండా కొన్ని మోడల్స్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్లు వినియోగదారులను పలకరించనున్నాయి. ముఖ్యంగా రియల్ మీ, రెడ్ మీ, వన్ ప్లస్, ఆసస్ కంపెనీలు ఈ నెలలో కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. కాబట్టి ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చే ఆ ఫోన్లపై ఓ లుక్కేద్దాం.
రియల్‌మీ జీటీ నియో 5ఎస్ఈ
ఏప్రిల్ 3న చైనాలో రియల్ మీ కంపెనీ జీటీ నియోగ ఎస్ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లు వినియోగదారులను అలరించనున్నాయి. స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2తో ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6.74 అంగుళాల ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో 64 ఎంపీ ఓమ్నివిజన్ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు ఏకంగా 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ యూజర్లను కచ్చితంగా ఆకర్షిస్తుంది.
రియల్ మీ నార్జో ఎన్ 55
ఈ ఫోన్ ఈ నెలలో భారతదేశంలో అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతన్నారు. ఈ ఫోన్ నార్జో ఫోన్స్‌లోని ఎన్ సిరీస్‌లో కొత్త ఫోన్. సాధారణంగా నార్జో ఎడిషన్లు కేవలం మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన ఈ కొత్త ఫోన్ మాత్రం ఉన్నత శ్రేణి వర్గాలను టార్గెట్ చేసుకుని కంపెనీ రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ ఫోన్ అమెజాన్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 4జీబీ+64 జీబీ, 6 జీబీ+64 జీబీ, 8 జీబీ+ 128 జీబీ వేరియంట్లల్లో ఈ ఫోన్ రానుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఫోన్ ధర, ఫీచర్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పోకో ఎఫ్5
ఇటీవల చైనాలో ప్రారంభించిన రెడ్‌మీ నోట్ 12కు రీబ్రాండ్‌గా ఈ ఫోన్ కంపెనీ లాంచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 6న ఈ ఫోన్ దేశంలో ప్రారంభించే అవకాశం ఉంది. పోకో ఎఫ్ 5 6.67 అంగుళాల క్యూ హెచ్‌డీ ప్లస్, ఎమో ఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది. అలాగే స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్2 చిప్ సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఫొటో లవర్స్‌ను ఈ ఫోన్ విపరీతంగా ఆకర్షించనుంది. అలాగే 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్
ఏప్రిల్‌లోనే ఈ ఫోన్ భారతదేశంలో రిలీజ్ అవ్వనుంది. ముఖ్యంగా 108 ఎంపీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ కోసం వన్ ప్లస్ ప్రియులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. 6.6 అంగుళాల డిస్‌ప్లేతో, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.
అసస్ ఆర్ఓజీ 7
గేమింగ్ ప్రియులను టార్గెట్ చేస్తూ కంపెనీ ఈ ఫోన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 13న రిలీజ్ చేయనుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ సూపర్ స్పీడ్‌తో పని చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ వెనుక వైపు ఆర్‌జీబీ లైటింగ్‌తో వస్తుంది. అత్యుత్తమ హార్డ్ వేర్‌తో వచ్చే ఈ ఫోన్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఫోన్ రిలీజయ్యే వరకూ వేచి ఉండాల్సిందే.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..