Apple Airpods: టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో ఎయిర్ పాడ్స్.. యాపిల్ సరికొత్త ఆవిష్కరణ
ముఖ్యంగా టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ వివిధ అప్‌డేట్స్‌తో ఎయిర్‌పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. యాపిల్ కంపెనీ త్వరలో రిలీజ్ చేయబోయే ఎయిర్ పాడ్స్ ఓ ప్రత్యేక డిజైన్‌తో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారు. ఫోన్‌కు అనుసంధానంగా పని చేసే స్మార్ట్ యాక్ససరీస్‌ను కూడా విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా పాటలు వినడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎయిర్ పాడ్స్‌ను వాడుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా వివిధ కంపెనీలు సరికొత్త ఎయిర్ పాడ్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ వివిధ అప్‌డేట్స్‌తో ఎయిర్‌పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. యాపిల్ కంపెనీ త్వరలో రిలీజ్ చేయబోయే ఎయిర్ పాడ్స్ ఓ ప్రత్యేక డిజైన్‌తో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్‌పాడ్స్‌ను ఓ అంతర్నిర్మిత టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను తీసుకువస్తుంది. ఈ ఫీచర్ వల్ల ఆడియోను నియంత్రించడంతో పాటు కనెక్ట్ చేసిన అప్లికేషన్‌ల పరస్పర చర్యల కోసం ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 2021లోనే దరఖాస్తు చేసింది. గత వారం యూఎస్ పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయం దీన్ని ధ్రువీకరించింది.
ఎయిర్ పాడ్స్‌లో ఫీచర్లు ఇవే
ఈ టెక్నాలజీతో హెడ్‌ఫోన్ కేస్ యుటిలిటీని మెరుగుపరచవచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లతో వినియోగదారు నియంత్రణను మరింత మెరుగుపరచవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్లేబ్యాక్ నియంత్రణలు, ఆడియో మూలాలను మార్చడం, ఆడియో అవుట్‌పుట్ మోడ్‌లను మార్చడం వంటివి ఈ హెడ్‌ఫోన్స్ ద్వారా చాలా సులభంగా చేయవచ్చు. ముఖ్యంగా డిస్‌ప్లే ద్వారా ఫోన్ నోటిఫికేషన్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎయిర్ పాడ్స్‌లో అదనపు మెమరీ మాడ్యూళ్లను కూడా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సరికొత్త ఆవిష్కరణపై యాపిల్ కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించ లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..