Apple: యాపిల్ నుంచి మరో స్మార్ట్ ఫీచర్.. ఫోన్ నుంచే ఎయిర్ పాడ్స్, వాచ్ లు చార్జింగ్.. అది కూడా వైర్ లెస్..
యాపిల్ సంస్థ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది. ఒక బ్యాటరీ నుంచి మరో బ్యాటరీని చార్జ్ చేసేలా దీనిని రూపొందిస్తోంది. అది కూడా పూర్తి వైర్ లెస్.
ఆధునిక సాంకేతికత ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో అద్భుతమైన వస్తువులు, ఆవిష్కరణలు మనిషికి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఒక్క స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. యావత్ ప్రపంచాన్ని మనిషి గుప్పిట్లోకి వచ్చేలా చేసింది. అయితే ఈ ఫోన్ పనిచేయాలంటే దానికి చార్జింగ్ అవసరం. ఇలాంటి ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పనిచేయాలన్నా దానికి చార్జింగ్ అవసరం. ఇందుకోసం చార్జర్లు, ఫాస్ట్ చార్జర్లు, పవర్ బ్యాంక్ లాంటివి మార్కెట్ లో ఉన్నాయి. ఇప్పుడు వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీ మార్కెట్‌లోకి తీసుకురానుంది. యాపిల్ సంస్థ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది. ఒక బ్యాటరీ నుంచి మరో బ్యాటరీని చార్జ్ చేసేలా దీనిని రూపొందిస్తోంది. అది కూడా పూర్తి వైర్ లెస్. అంటే యాపిల్ ఫోన్ నుంచి ఇతర యాపిల్ ఉత్పత్తులు ఏవైనా వైర్ కనెక్ట్ చేయకుండానే చార్జ్ చేసుకోవచ్చన్నమాట. దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రివర్స్ వైర్ లెస్ చార్జింగ్..
యాపిల్ సంస్థ కొన్నేళ్లుగా రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఐఫోన్ 11 సిరీస్ ఆవిష్కరించేటప్పుడే దీనికి సంబంధించిన ఊహాగానాలు వినిపించాయి. దాదాపు మూడు సంవత్సరాలకు పైగా దీని గురించి చర్చ నడుస్తోంది. అయితే యాపిల్ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా 9 టు5 మ్యాక్ నివేదిక ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాపిల్ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంది. దీంతో త్వరలో వచ్చే కొత్త మోడల్ ఐ ఫోన్ మోడల్ లో ఈ ఫీచర్ ను చూడవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ అంటే ఏమిటీ?
రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ అంటే ఒక డివైజ్ బ్యాటరీ నుంచి నుంచి ఇతర డివైజ్ ల బ్యాటరీలను చార్జ్ చేయడం. ఎటువంటి వైర్ కనెక్షన్లు లేకుండా పూర్తి వైర్ లెస్ తో ఇది సాధ్యమవుతుంది. యాపిల్ ఐ ఫోన్ వెనుక వైపు వైర్ లెస్ చార్జింగ్ ప్యాడ్ ఒకటి ఉంటుంది. ఇది యాపిల్ ఫోన్ బ్యాటరీలో ఉన్న సామర్థ్యాన్ని కొంత మేరకు యాపిల్ ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచ్ వంటి వాటి బ్యాటరీలకు అందిస్తుంది. ఇది ప్రయాణలప్పుడు బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే వివిధ రకాల గ్యాడ్జెట్లను ఒకేసారి చార్జ్ చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. ఐ ఫోన్ ఫాస్ట్ చార్జర్ ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకుంటూ.. ఫోన్ వెనుకవైపు ఉన్న ప్యాడ్ ద్వారా ఇతర డివైజ్ లను కూడా ఒకేసారి చార్జ్ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..