Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gita GPT: గీతాసారం.. యాప్ లో నిక్షిప్తం.. మీరు అడిగిన ప్రశ్నకు కృష్ణుడే సమాధానం చెబుతున్నట్లుగా..

ఇదే క్రమంలో జీపీటీ 3 ఆధారితమైన అనేక యాప్ లు ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిలో గీత జీపీటీ(Gita GPT) ఒకటి. ఇది మీ జీవిత సమస్యలకు భగవద్గీత నుంచి సమాధానాలు ఇస్తుంది.

Gita GPT: గీతాసారం.. యాప్ లో నిక్షిప్తం.. మీరు అడిగిన ప్రశ్నకు కృష్ణుడే సమాధానం చెబుతున్నట్లుగా..
Gita Gpt
Follow us
Madhu

|

Updated on: Feb 08, 2023 | 5:00 PM

ఇంటర్ నెట్ సర్కిళ్లలో లేటెస్ట్ సెన్సెషన్ చాట్ జీపీటీ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఈ నూతన ఆవిష్కరణ వినియోగదారులకు బాగా కనెక్ట్ అవుతోంది. అడిగిన ప్రశ్నకు యాప్ట్ అయిన సమాధానం ఇస్తూ.. అడిగిన అన్ని ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలిస్తున్న చాట్ జీపీటీ శరవేగంగా జనాల్లోకి వెళ్తోంది. అందుకే గూగుల్ లాంటి సంస్థ కూడా చాట్ జీపీటీ దెబ్బకు దడిసి తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ బార్డ్ ను పట్టాలెక్కించింది. అనుకున్న దానికన్నా ముందుగానే దానిని వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో చాలా స్టార్టప్ కంపెనీలు, చిన్న, పెద్ద కంపెనీలు కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ఈ చాట్ జీపీటీ లాగా సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ను అధిగమించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో జీపీటీ 3 ఆధారితమైన అనేక యాప్ లు ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిలో గీత జీపీటీ(Gita GPT) ఒకటి. ఇది మీ జీవిత సమస్యలకు భగవద్గీత నుంచి సమాధానాలు ఇస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ మన దేశంలో వైరల్ అవుతోంది. అసలు ఈ యాప్ ఏంటి? దాని సృష్టికర్త ఎవరు? యాప్ ఎలా పనిచేస్తుంది? దాని ఉపయోగం ఏంటి? ఓ సారి తెలుసుకుందాం..

భగవద్గీత నుంచి పరిష్కార మార్గాలు..

గూగుల్ ఇండియా సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయిన సుకురు సాయి వినీత్ ఈ గీత జీపీటీ ని ఆవిష్కరించారు. మీ జీవితంలోని ప్రశ్నలకు పరిష్కార మార్గాలను భగవద్గీతను అందించేలా దీనిని రూపొందించారు. GPT-3 శక్తితో ఈ Gita GPT పనిచేస్తుంది. ప్రజలు యాప్ ద్వారా ప్రశ్నలు అడిగినప్పుడు అది భగవద్గీతను రిఫరెన్స్ గా తీసుకొని ప్రశ్నకు దాని నుంచి సమాధానాన్ని వెతుకుతుంది. అర్జునుడు అతని రథసారథి అయిన శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణను అనుసరిస్తుంది. ఇందుకోసం యాప్ లో ప్రత్యేకమైన ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ కూడిన చాట్‌బాట్ ఉంటుంది. ఇది ప్రజల ప్రశ్నలకు ప్రతిస్పందిస్తుంది. వినియోగదారుకు కచ్చితమైన సమాధానాలు ఇస్తుంది. అలాగే అడిగిన ప్రశ్నకు అనుగుణంగా భగవద్గీత నుంచి శ్లోకాలతోపాటు వాటిని వారి జీవితానికి అన్వయించి మంచి ఉపదేశాన్ని అందించే సామర్థ్యం ఈ యాప్ కు ఉంది. ఉదాహరణకు, ఒక వినియోగదారు అంతర్గత శాంతికి మార్గం గురించి ఆరా తీస్తే, చాట్‌బాట్ సంబంధిత గ్రంథాల శ్లోకాలతో పాటు వాటిని ఒకరి జీవితానికి ఎలా అన్వయించుకోవాలో అనే ఆలోచనలను కూడా సూచిస్తుంది.

మరిన్ని సాధనాలు ఇవి..

గీత బోధలతో వినియోగదారులకు సహాయం చేయడానికి అనేక ఇతర ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తో కూడిన యాప్‌లు ఇంటర్ నెట్ లో అందుబాటు ఉన్నాయి. ఇందులో https://gita.kishans.in అనే యాప్ ఒకటి. దీనిలో చాట్ బాట్ శ్రీకృష్ణుడి పాత్రను తీసుకుంటుంది. వినయోగదారుడు అర్జునిడిగా ప్రశ్నలు అడగవచ్చు. అలాగే www.bhagavadgita.ai అనేది మరో ఆప్షన్ ఉంది. దీనిలో వినియోగదారులు శ్రీకృష్టుడిని ప్రశ్నలు అడిగే విధంగా యాప్ రూపొందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్  చేయండి..