Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oneplus Phone : అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. రూ.1299కే వన్‌ప్లస్ ఫోన్ మీ సొంతం

వన్ ప్లస్ కంపెనీ కూడా నార్డ్ సిరీస్‌లో తక్కువ ధరలకే వన్ ప్లస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే నార్డ్ 1, నార్డ్ సీఈ 2 ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. త్వరలో కంపెనీ కూడా వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 కూడా విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Oneplus Phone : అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. రూ.1299కే వన్‌ప్లస్ ఫోన్ మీ సొంతం
Amazon
Follow us
Srinu

|

Updated on: Apr 05, 2023 | 2:35 PM

వన్‌ప్లస్ ఫోన్ అంటే మొబైల్ యూజర్లకు ఓ క్రేజ్ ఉంది. ముఖ్యంగా వన్ ప్లస్ మొబైల్స్‌లో ఫొటో క్లారిటీకి చాలా మంది మంత్రముగ్దులవుతారు. వన్ ప్లస్ ఫోన్‌ను సెల్ఫీ లవర్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు. అయితే ధర విషయం చూసుకుంటే వన్ ప్లస్ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. మధ్య తరగతి మొబైల్ ప్రియులను వన్ ప్లస్ ఫోన్ అందని ద్రాక్షగానే ఉంటుంది. అయితే వారిని టార్గెట్ చేస్తూ వన్ ప్లస్ కంపెనీ కూడా నార్డ్ సిరీస్‌లో తక్కువ ధరలకే వన్ ప్లస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే నార్డ్ 1, నార్డ్ సీఈ 2 ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. త్వరలో కంపెనీ కూడా వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 కూడా విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే విపరీతంగా ఆకట్టుకున్న వన్ ప్లస్ ఫోన్ రూ.1299కే వస్తుంది. అవును మీరు వింటున్నది నిజమే.. వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 ఫోన్ వివిధ ఆఫర్లతో కలుపుకుని అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ఫోన్ ఆఫర్ల వివరాలతో పాటు స్పెసిఫికేషన్ వివరాలను ఓ సారి చూద్దాం.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 ఫోన్ 6 జీబీ+128 జీబీ వేరియంట్ సాధారణ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్ 6.59 అంగుళాల డిస్‌ప్లేతో స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేస్తున్నారు. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఫోన్ వెనుక వైపు 64 ఎంపీ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.1299కే వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ధరకే ఫోన్ మీ చేతిలోకి వస్తుంది. అమెజాన్‌లో ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గుతుంది. అలాగే మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.17700 తగ్గుతుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ ధర మీ పాత ఫోన్ కండిషన్ బట్టి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మరి ఇంకేందుకు ఆలస్యం మీ దగ్గర ఉన్న పాత ఫోన్‌ను మార్చి కొత్త వన్ ప్లస్ ఫోన్‌ను మీ సొంతం చేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..