Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moto G13 Smart Phone: లాంచింగ్‌కు సిద్ధమైన మోటోరోలా కొత్త ఫోన్‌.. అతి తక్కువ ధర.. అద్భుత ఫీచర్లు.. వివరాలు ఇవి..

మోటో జీ13 ఫోన్‌ ఈ నెలలోనే మన దేశంలో లాంచ్‌ అ‍య్యే అవకాశం ఉంది. కొన్ని అంచనాల ప్రకారం ఇది 4జీ ఫోన్‌. ఇది రూ. 12,000 కన్నా తక్కువ ధరలో లభించే అవకాశం ఉంది.

Moto G13 Smart Phone: లాంచింగ్‌కు సిద్ధమైన మోటోరోలా కొత్త ఫోన్‌.. అతి తక్కువ ధర.. అద్భుత ఫీచర్లు.. వివరాలు ఇవి..
Moto G13
Follow us
Madhu

|

Updated on: Mar 23, 2023 | 12:30 PM

మోటోరోలా నుంచి మరో కొత్త ఫోన్‌ ఇండియా మార్కెట్లోకి త్వరలో రానుంది. మోటో జీ13 అనే మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మోటోరోలా ఇంకా రివీల్ చేయలేదు. అయితే బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ తో పాటు పలు సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ లో ఈ డివైజ్ దర్శనమిచ్చింది. దీంతో ఈ డివైజ్ లాంచ్ పై క్లారిటీ వచ్చినట్లైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

ధర ఎంత ఉండొచ్చు అంటే..

మోటో జీ13 ఫోన్‌ ఈ నెలలోనే మన దేశంలో లాంచ్‌ అ‍య్యే అవకాశం ఉంది. కచ్చితమైన ధరలు అంచనావేయలేం. అయితే కొన్ని అంచనాల ప్రకారం ఇది 4జీ ఫోన్‌. రూ. 12,000 కన్నా తక్కువ ధరలో లభించే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్లు ఇవి..

మోటో జీ13 ఫోన్‌ లో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఉంటుంది. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ ప్లే, 90Hz రిఫ్రెష్మెంట్‌ రేట్‌తో వస్తుంది. దీనిలోని స్క్రీన్‌ 1600*720 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ ఆధారపడి ఇది పనిచేస్తుంది. అలాగే 5000ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిస్తోంది. 10వాట్స్‌ చార్జింగ్‌ సపోర్టు ఉంటుంది. ఇది 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ సామర్థ్యంతో పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు ఇవి..

4జీ కనెక్టివిటీతో పాటు వైఫై 802.11 ఏసీ, బ్లూటూట్‌ 5.1, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌ సీ, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఉంటుంది. అలాగే దీనిలో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. వెనుకవైపు  50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ, డెప్త్‌ సెన్సార్‌, 2ఎంపీ మాక్రో యూనిట్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ఉంటుంది. ఎదురువైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..