AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New Update: వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్‌ మామూలుగా లేవుగా.. గ్రూప్ అడ్మిన్లకు ఇక పండగే.. వివరాలు ఇవి..

వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను తీసుకురానుంది. ఈ రెండూ కూడా వాట్సాప్ గ్రూపులకు సంబంధించినవే. ఈ కొత్త గ్రూపు ఫీచర్లతో గ్రూపులోని అడ్మిన్‌కు మరింత కంట్రోల్ లభించనుంది.

WhatsApp New Update: వాట్సాప్‌లో  కొత్త ఫీచర్స్‌ మామూలుగా లేవుగా.. గ్రూప్ అడ్మిన్లకు ఇక పండగే.. వివరాలు ఇవి..
Whatsapp
Madhu
|

Updated on: Mar 23, 2023 | 12:00 PM

Share

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఉ‍న్నారు. సమాచార మార్పిడికి ప్రస్తుతానికి ఇదే బెస్ట్‌ ఆప్షన్‌. మెసేజ్‌లు, వీడియోలతో పాటు గ్రూప్‌లు, కమ్యూనిటీలు, స్టేటస్‌ వంటి ఫీచర్ల ద్వారా వినియోగదారులకు నిరంతరాయ సేవలు అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు, ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను మంచి అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో వాట్సాప్‌ గ్రూపులకు సంబంధించిన మరో రెండు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఆ ఫీచర్లు ఏంటి? వాటి వల్ల వినియోగదారులకు ప్రయోజనం ఏంటి? ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి? వంటి విషయాలను తెలుసుకుందాం.

గ్రూప్‌ అడ్మిన్‌లకు మరింత పవర్‌..

వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను తీసుకురానుంది. ఈ రెండూ కూడా వాట్సాప్ గ్రూపులకు సంబంధించినవే. ఈ కొత్త గ్రూపు ఫీచర్లతో గ్రూపులోని అడ్మిన్‌కు మరింత కంట్రోల్ లభించనుంది. తద్వారా గ్రూప్‌లో ఎవరు జాయిన్ కావొచ్చు అనేదానిపై అడ్మిన్లు మరింత కచ్చితంగా వ్యవహరించవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది..

రాబోయే వాట్సాప్ అప్‌డేట్‌తో అడ్మిన్‌లకు వారి గ్రూప్ ప్రైవసీపై మరింత కంట్రోల్ అందించనుంది. అంతేకాక గ్రూపులో ఎవరూ జాయిన్ కావాలో లేదో కూడా నిర్ణయించే అధికారం ఆయా గ్రూపు అడ్మిన్లకు అందిస్తుంది. ఒక అడ్మిన్ తమ గ్రూప్ ఇన్వైట్ లింక్‌ని షేర్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. వారి గ్రూప్‌ను కమ్యూనిటీలో చేరేలా చేయవచ్చు. వాట్సాప్ గ్రూపులోని సభ్యుల చాట్ ఆధారంగా అడ్మిన్‌లు ఎవరు తమ అడ్మిన్లలో జాయిన్ కావొచ్చు లేదా అనేది నిర్ణయించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎవరెవరు షేర్ చేశారు తెలిసిపోద్ది..

వాట్సాప్ గ్రూపులో తెలిసిన యూజర్లతో అన్ని గ్రూపులలో ఏది షేర్ చేస్తున్నారో చూడొచ్చు. యూజర్లు తమ గ్రూపులలో ఉమ్మడిగా ఉన్న కాంటాక్టు కోసం సెర్చ్ చేయొచ్చు. కమ్యూనిటీలు, భారీ గ్రూపులలో మీరు ఎవరితోనైనా ఉమ్మడిగా ఉన్న గ్రూపులను సులభంగా తెలుసుకోవచ్చు. ఒకే చోట అన్ని సంబంధిత గ్రూపులతో కనెక్ట్ కావొచ్చు.వేర్వేరు గ్రూపుల్లో ఒకే కాంటాక్టును కలిగిన ఎవరితోనైనా షేర్ చేసిన వారి కాంటాక్టును సులభంగా సెర్చ్ చేయొచ్చునని కంపెనీ తెలిపింది. రాబోయే వారాల్లో ఈ ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ అడ్మిన్‌లు నిర్వహించే గ్రూప్‌లలో పంపిన మెసేజ్‌లను డిలీట్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. గ్రూప్ చాటింగ్ ఫీచర్‌ను యూజర్లకు అందించడానికి మరిన్ని కొత్త టూల్స్ యాడ్ చేస్తూనే ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్