Lava Agni 2: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న లావా అగ్ని-2… తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు..
దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన లావా తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. తక్కువ ధరకే కర్వ్డ్ డిస్‌ప్లేతో ఫోన్ అందిస్తుంది. లావా అగ్ని 2 5జీ పేరుతో గత వారం భారతదేశంలో ప్రారంభించారు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి లావా అగ్ని 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఓ మంచి ఎంపికగా ఉంటుంది.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరైంది. ఓ కుటుంబంలో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో కంపెనీలు కూడా కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేయడానికి ఉత్సాహంగా చూపుతున్నాయి. వినియోగదారుల అభిరుచులకు తగినట్లు ఫోన్లు రిలీజ్ చేసి మార్కెట్‌లో తమ మార్క్‌ను చూపుతున్నాయి. దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన లావా తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. తక్కువ ధరకే కర్వ్డ్ డిస్‌ప్లేతో ఫోన్ అందిస్తుంది. లావా అగ్ని 2 5జీ పేరుతో గత వారం భారతదేశంలో ప్రారంభించారు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి లావా అగ్ని 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఓ మంచి ఎంపికగా ఉంటుంది. బుధవారం నుంచి ఈ ఫోన్ ప్రముఖ ఆన్‌లైన్ కొనుగోలు సంస్థ అయిన అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ సేల్‌లో ఈ ఫోన్ తన హవా చూపింది.
ధర, బ్యాంకు ఆఫర్లు
లావా అగ్ని 2 5జీ ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా లావా అన్ని ప్రధాన డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ. 2,000 తగ్గింపును అందిస్తోంది, అంటే ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు రూ. 19,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లావా అగ్ని 2 5జీ గ్లాస్ విరిడియన్ రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది.
లావా అగ్ని 2 5 జీ స్పెసిఫికేషన్లు
లావా అగ్ని 2 5జీ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 950 నిట్‌ల బ్రైట్ నెస్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5జీ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. అలాగే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. లావా అగ్ని 2 8 జీబీ+256 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. లావా 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా వాగ్దానం చేస్తుంంది. లావా అగ్ని 2 5 జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, డెప్త్, మాక్రో సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌తో 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 16 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.



మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..