5

Lava Yuva 2 Pro: రూ. 7,999కే ఐఫోన్ లుక్‌లో స్మార్ట్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. అస్సలు మిస్ కాకండి..

లావా యువ 2 ప్రో (Lava Yuva 2 Pro) పేరిట దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. గ్లాస్ బ్యాక్, రియర్‌ కెమెరా సెటప్‌, ఫ్లాట్ సైడ్ ఎడ్జ్‌లు వంటివి ఐఫోన్ 14 ప్రో తరహాలో ఉంటాయి.

Lava Yuva 2 Pro: రూ. 7,999కే ఐఫోన్ లుక్‌లో స్మార్ట్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. అస్సలు మిస్ కాకండి..
Lava Yuva 2 Pro
Follow us

|

Updated on: Feb 23, 2023 | 1:15 PM

మీరు పదివేల లోపు బడ్జెట్ లో మంచి 4జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అది కూడా యాపిల్ లుక్ లో ఉంటే బాగుండని భావిస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ప్రముఖ స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా ఓ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. లావా యువ 2 ప్రో (Lava Yuva 2 Pro) పేరిట దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. లావా యువ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ గ్లాస్ బ్యాక్‌తో ప్రీమియం డిజైన్, బిల్డ్ ఫ్యాక్టర్‌ తో వస్తుంది. ఈ ఫోన్‌ యాపిల్‌ ప్రో ఐఫోన్ లైనప్‌ను పోలి ఉంటుంది. గ్లాస్ బ్యాక్, రియర్‌ కెమెరా సెటప్‌, ఫ్లాట్ సైడ్ ఎడ్జ్‌లు వంటివి ఐఫోన్ 14 ప్రో తరహాలో ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రో ధర, స్పెసిఫికేషన్లను ఇప్పుడు చూద్దాం..

సిప్లీ సూపర్బ్..

లావా యువ 2 ప్రో స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. దీని ధర రూ. 7,999గా ఉంది. అంతే కాక దీనికి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. 3జీబీ వరకూ ఈ వర్చువల్ ర్యామ్ సపోర్టు చేస్తుంది. లావా రిటైల్ నెట్‌వర్క్, అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఫోన్ గ్లాస్ వైట్, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అంతేకాక ఈ ఫోన్ లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు డౌట్‌నట్ కోర్సు మెటీరియల్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీ-లోడ్ చేసుకోవచ్చు. దీని విలువ దాదాపు రూ. 12,000 ఉంటుంది..

స్పెసిఫికేన్లు ఇలా..

లావా యువ 2 ప్రో ఫోన్ 6.5-అంగుళాల హెచ్ డీ ప్లస్ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.మీడియా టెక్ హీలియో జీ 37 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 కి అప్ గ్రేడ్ అవుతుంది. రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్లను అందిస్తుంది. ఇది తక్కువ ప్రాధాన్యత కలిగిన యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయడంలో సహాయం చేస్తుంది. హైబ్రిడ్ సిమ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీని 256జీబీ వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఫోన్‌ ముందువైపు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 13ఎంపీ ప్రైమరీ కెమెరా, రెండు అదనపు వీజీఏ కెమెరాలు ఉన్నాయి. దీని ఇన్‌బిల్ట్ కెమెరా యాప్‌లో ‘AI’ మోడ్ కూడా ఉంది. లావా యువ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. యూజర్లకు ఫ్రీ హోమ్ సర్వీస్ ను కూడా అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశ రాజధానిని షేక్‌ చేసిన చోరీ ఘటన.. ఏకంగా రూ.25 కోట్ల నగలు లూటీ
దేశ రాజధానిని షేక్‌ చేసిన చోరీ ఘటన.. ఏకంగా రూ.25 కోట్ల నగలు లూటీ
వన్డేల్లో 4వ ప్లేయర్‌గా రికార్డ్‌ సృష్టించిన మహ్మదుల్లా..
వన్డేల్లో 4వ ప్లేయర్‌గా రికార్డ్‌ సృష్టించిన మహ్మదుల్లా..
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. 32 శాతం బోనస్
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. 32 శాతం బోనస్
అద్దెకు సల్మాన్ ఖాన్ అపార్ట్‏మెంట్.. నెలకు రెంట్ తెలిస్తే..
అద్దెకు సల్మాన్ ఖాన్ అపార్ట్‏మెంట్.. నెలకు రెంట్ తెలిస్తే..
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురు అరెస్టు
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురు అరెస్టు
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర టీడీపీ నేతలు.. ఆ నియోజకవర్గాల్లో పర్యటన
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర టీడీపీ నేతలు.. ఆ నియోజకవర్గాల్లో పర్యటన
అక్టోబర్​ నెలలో బ్యాంక్​లకు సగం సెలవులే.. లిస్ట్‌ ఇదే..!
అక్టోబర్​ నెలలో బ్యాంక్​లకు సగం సెలవులే.. లిస్ట్‌ ఇదే..!
సింగరేణి ఎన్నికలపై హైకోర్ట్ కీలక ఉత్తర్వులు..
సింగరేణి ఎన్నికలపై హైకోర్ట్ కీలక ఉత్తర్వులు..
మరింత స్టైలీష్ అండ్ మాస్ హీరోగా సూపర్ స్టార్..
మరింత స్టైలీష్ అండ్ మాస్ హీరోగా సూపర్ స్టార్..
దేశంలోనే అతిపెద్ద మాల్.. రేపే హైదరాబాద్‌‌లో ప్రారంభం
దేశంలోనే అతిపెద్ద మాల్.. రేపే హైదరాబాద్‌‌లో ప్రారంభం