Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6G Technology: ఇండియా 6జీ టెక్నాలజీని నడిపిస్తుంది.. భారత 4జీ, 5జీ సాంకేతికతను అమెరికా కోరుతోందన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

దేశంలో ఇప్పటికే పలు చోట్ల 5జీ టెక్నాలజీని ప్రారంభించారు. అయితే 5జీ టెక్నాలజీ ఇంకా దేశం మొత్తం విస్తరించక ముందే కేంద్ర రైల్వే, సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక 6జీ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఇంజనీర్లు 6జీ టెక్నాలజీ పేటెంట్లు పొందుతున్నారని.. ఇప్పటికే వాటి సంఖ్య 100కు చేరుకుందని తెలిపారు.

6G Technology: ఇండియా 6జీ టెక్నాలజీని నడిపిస్తుంది.. భారత 4జీ, 5జీ సాంకేతికతను అమెరికా కోరుతోందన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
Union Minister Ashwini Vaishnaw
Follow us
Aravind B

|

Updated on: May 25, 2023 | 1:36 AM

దేశంలో ఇప్పటికే పలు చోట్ల 5జీ టెక్నాలజీని ప్రారంభించారు. అయితే 5జీ టెక్నాలజీ ఇంకా దేశం మొత్తం విస్తరించక ముందే కేంద్ర రైల్వే, సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక 6జీ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఇంజనీర్లు 6జీ టెక్నాలజీ పేటెంట్లు పొందుతున్నారని.. ఇప్పటికే వాటి సంఖ్య 100కు చేరుకుందని తెలిపారు. ప్రధాని మోదీ దార్శనికత గురించి మాట్లాడిన ఆయన 5జీ సాంకేతికత విషయంలో ప్రపంచంతో పాటు ఇండియా వేదిక పంచుకుంటుందని పేర్కొన్నారు. అలాగే 6జీ సాంకేతికతను దేశం ముందుకు నడిపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండియా సాంకేతిక ఎగుమతిదారుగా మారుతోందని.. తనకు అడిషనల్ సెక్రటరీ ఫోన్ చేసి ఇండియాకు చెందిన 4జీ, 5జీ టెక్నాలజీని అమెరికా వాడుకోవాలని అనుకుంటుందని చెప్పినట్లు పేర్కొన్నారు. డెహ్రడూన్‌లోని 2,00,000 వ 5జీ సైట్, చర్దమ్ ఫైబర్ కనెక్టివిటీ ప్రారంభోత్వంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టెలికాం టవర్‌లో అత్యాధునిక పరికరం రెడియో పరికరమని.. అయితే ఇండియాలో తయారు చేసిన రేడియే పరికరాన్నే అమెరికాలో ఎక్కవగా ఏర్పాటు చేస్తున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే దేశంలో 4జీ, 5జీ స్టాక్ విస్తరణ బీఎస్‌ఎన్‌లో ప్రారంభమైందని చెప్పిన ఆయన చండీగఢ్, డెహ్రడూన్‌ల మధ్య 200 స్థానాల్లో వీటిని ఇన్‌స్టాల్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 4జీ సేవలు అందిస్తున్న బీఎస్ఎన్‌ఎల్ నవంబర్, డిసెంబర్ నాటికి 5జీకి మారుతుందని తెలిపారు. అయితే ఇంకా 1581 గ్రామాలకు 4జీ సేవలు రావాల్సి ఉన్నాయని.. వీటి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని.. ఈ బాధ్యతను బీఎస్ఎన్ఎల్‌కు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోదీ 6జీ విజన్ డ్యాకుమెంటేషన్‌ను సమర్పించి.. 6జీ ఆర్ అండ్ డీ టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. 2022 అక్టోబర్‌లో ఇండియాలో 5జీ టెక్నాలజీని ప్రారంభించగా.. కేవలం ఐదు నెలల్లోనే లక్ష 5జీ నెట్‌వర్క్ సైట్లు అందుబాటులోకి వచ్చాయని.. ఆ తర్వాత మరో మూడు నెలల్లో లక్ష సైట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దీంతో ఇప్పటికే 2 లక్షల 5జీ సైట్లు పూర్తికాగా 2023 డిసెంబర్ 31 నాటికి మరో 1.5 లక్షల సైట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం భారత 6జీ మిషన్‌ను రెండు భాగాలుగా విభజించాలని నిర్ణయించింది. 2023-2025 మధ్య మొదటి దశలో దేశంలోని పలు ప్రాంతాల్లో 6జీ సర్వీసులను ప్రారంభించాలని, అలాగే 2025-2030 మధ్య రెండో దశలో మిగిలిన ప్రాంతాల్లో ఆ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..