AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: కేవలం రూ. 8,999కే స్మార్ట్ ఫోన్.. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్.. ఫీచర్లు కూడా టాప్ క్లాస్..

మీరు అతి తక్కువ ధరకు ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో బెస్ట్ ఆప్షన్ అందుబాటులో వచ్చింది. కేవలం రూ. 8,999 కే మంచి 4జీ ఫోన్ ఉంది. దీనిని లావా కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది.

Smartphone: కేవలం రూ. 8,999కే స్మార్ట్ ఫోన్.. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్.. ఫీచర్లు కూడా టాప్ క్లాస్..
Lava Blaze 2 Smart Phone
Madhu
|

Updated on: Apr 14, 2023 | 12:13 PM

Share

మీరు అతి తక్కువ ధరకు ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో బెస్ట్ ఆప్షన్ అందుబాటులో వచ్చింది. కేవలం రూ. 8,999 కే మంచి 4జీ ఫోన్ ఉంది. దీనిని లావా కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది. లావా బ్లేజ్ 2 పేరుతో ఏప్రిల్ 18 నుంచి అమెజాన్ లో విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. ఇది మోటోరోలా, రియల్ మీ కంపెనీలకు చెందిన పలు బడ్జెట్ లెవెల్ ఫోన్లతో పోటీ పడనుంది. అలాగే బ్లేజ్ 2 5జీ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 11, 999గా ఉంది. లావా బ్లేజ్ 2 స్మార్ట్ ఫోన్ 4జీ వెర్షన్ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డిజైన్, లుక్.. లావా బ్లేజ్ 2 సరసమైన ధరలో లభ్యమవుతున్నప్పటికీ ఫోన్ మెటీరియల్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇది ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్, పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరలో ఇది అసాధారణమైన డిజైన్ అని చెప్పాలి. గతేడాది మోటరోలా మోటో జీ22ను వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌కు బదులుగా హోల్-పంచ్ డిస్‌ప్లేతో ప్రారంభించింది. దీనిని లావా బ్లేజ్ 2లో వినియోగించింది.

యాప్స్.. ఇది బ్లోట్-ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది. అంటే వినియోగదారు స్మార్ట్‌ఫోన్ కోసం అవసరమైన యాప్‌లను మాత్రమే పొందుతారు. జీమెయిల్, కెమెరా సెట్టింగ్స్ వంటి కొన్ని ఆండ్రాయిడ్ స్టాక్ యాప్‌లు మాత్రమే ఇందులో ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

స్పెసిఫికేషన్లు.. ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల హెచ్ డీ ప్లస్, ఐపీఎస్ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 2.5D కర్వ్డ్ స్క్రీన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. వెనుకవైపు13-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సెటప్‌ ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ స్నాపర్ ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది.

ధర, లభ్యత.. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన ఈ ఫోన్ ధర రూ. 8,999గా ఉంది. గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యమయ్యే ఈ ఫోన్ విక్రయాలు ఏప్రిల్ 18 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో ప్రారంభమవుతాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ ఆరోగ్య రహస్యం తెలిసినా పాటించరు..
మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ ఆరోగ్య రహస్యం తెలిసినా పాటించరు..
మాకు దొరికేశాడు ఓ ఆణిముత్యం.. రోహిత్ ఇక నువ్వు లగేజీ సర్దేయ్..!
మాకు దొరికేశాడు ఓ ఆణిముత్యం.. రోహిత్ ఇక నువ్వు లగేజీ సర్దేయ్..!
NTR పేరు బద్నాం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.. : NTR ఫ్యాన్ కన్వీ
NTR పేరు బద్నాం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.. : NTR ఫ్యాన్ కన్వీ
గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ..
గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ..
డార్క్ సీక్రెట్స్ ఆఫ్ గ్రూప్ డ్యాన్స్
డార్క్ సీక్రెట్స్ ఆఫ్ గ్రూప్ డ్యాన్స్
యూపీఐ లావాదేవీలు చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం షాకింగ్
యూపీఐ లావాదేవీలు చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం షాకింగ్