- Telugu News Photo Gallery Technology photos BSNL Offering 269 rupees plan with unlimited calls and many other benefits
Recharge: రూ. 269 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్.. పూర్తి వివరాలు
ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ. 269 రీఛార్జ్ ప్లాన్‌లో యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 2 జీబీ డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..
Updated on: Apr 10, 2023 | 9:50 PM

టెలికాం రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు రకరకాల రీఛార్జ్ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

రూ. 269తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ వంటి బెనిఫిట్స్‌ను అందిస్తున్నారు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.

వీటితో పాటు రోజుకి 2జీబీ డేటా అందిస్తారు. ఈ ప్యాక్‌లో ప్రత్యేకంగా ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోస్‌నౌ, లిజన్ పాడ్‌కాస్ట్ సర్వీసెస్, లోక్‌ధన్ కంటెంట్, జింగ్ మ్యూజిక్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ బెనిఫిట్స్ పొందొచ్చు.

హార్డీ గేమ్స్, ఛాలెంజెస్ అరీనా మొబైల్ గేమింగ్ సర్వీస్, ఆస్ట్రోసెల్, గేమ్‌ఆన్, గేమియం వంటి ఆప్షన్స్ పొందొచ్చు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ ద్వారా మీకు నచ్చిన పాటను హలోట్యూన్‌గా కూడా పెట్టుకోవచ్చు.

ఇలా బీఎస్‌ఎన్‌లో సుమారు రోజుకు 10 రూపాయలతో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ వంటి ప్రత్యేక బెనిఫిట్స్‌ను పొందొచ్చు.





























