Smart TV: స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు అలర్ట్.. అవన్నీ ఆండ్రాయిడ్ టీవీలు కాదంటున్న గూగుల్.. వివరాలు..
ప్రతి టీవీకి ఆండ్రాయిడ్ అని ట్యాగ్ తగిలించి అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై గూగుల్ వివరణ ఇచ్చింది. ఇలా ప్రతి ఎల్ఈడీని ఆండ్రాయిడ్ ని క్లయిమ్ చేస్తున్నారు కానీ అది నిజం కాదని స్పష్టం చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్ టీవీగా పిలిచే టీవీ బాక్స్ లు విక్రయిస్తున్నారని గుర్తించినట్లు వివరించింది.
ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలకు బాగా డిమాండ్ పెరిగింది. అందరూ ఆండ్రాయిడ్ వెర్షన్లో పలు యాప్స్ ఉన్న ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. దీంతో బయట మార్కెట్లో చాలా రకాల కంపెనీలు ఆండ్రాయిడ్ టీవీల పేరిట మార్కెట్లో విక్రయాలు చేస్తున్నారు. ప్రతి టీవీకి ఆండ్రాయిడ్ అని ట్యాగ్ తగిలించి అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై గూగుల్ వివరణ ఇచ్చింది. ఇలా ప్రతి ఎల్ఈడీని ఆండ్రాయిడ్ ని క్లయిమ్ చేస్తున్నారు కానీ అది నిజం కాదని స్పష్టం చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్ టీవీగా పిలిచే టీవీ బాక్స్ లు విక్రయిస్తున్నారని గూగుల్ గుర్తించింది. వాటిని వినియోగించకూడదని చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తేడా ఏంటి..
బయట మార్కెట్లో విక్రయిస్తున్న టీవీ బాక్స్ లు ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు(ఏఓఎస్పీ) ద్వారా పనిచేస్తాయని గూగుల్ పేర్కొంది. వీటిని ఇన్ స్టాల్ చేసిన టీవీల్లో గూగుల్ నుంచి లైసెన్స్ పొందకుండా, అనుమతి తీసుకోకుండా గూగుల్ యాప్స్, ప్లే స్టోర్ యాక్సెస్ చేస్తున్నట్లు గూగుల్ సంస్థ గుర్తించింది. ఇలా చేసే టీవీలకు ప్లే ప్రోటెక్ట్ సర్టిఫికెట్ ఉండదని, వినియోగదారులు గమనించాలని చెబుతోంది. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్, ప్లే ప్రొటెక్ట్ సర్టిఫైడ్ ఉన్న పర్టనర్ల లిస్ ఆండ్రాయిడ్ టీవీ వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది.
ఇవి తనిఖీ చేయండి..
కస్టమర్‌లు తాము కొనుగోలు చేస్తున్నది సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడంలో సహాయపడటానికి, అధికారిక ఆండ్రాయిడ్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా గూగుల్ సిఫార్సు చేస్తోంది. ఇక్కడ కొనుగోలుదారులు అధికారిక ఆండ్రాయిడ్, గూగుల్ టీవీ నుంచి ఆండ్రాయిడ్ టీవీ ఉత్పత్తులను చూడగలరని చెబుతోంది.అలాగే గూగుల్ ప్లే మరో మార్గం. ఇది ప్లే స్టోర్‌లోని ధృవీకరణ, ఇది పరికరం అధికారికంగా గూగుల్ ద్వారా లైసెన్స్ పొందిందో లేదో నిర్ధారిస్తుంది. మీ టీవీకి ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికెట్ ఉండితీరాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..