Vi Recharge Plans: వీటితో రీచార్జ్ చేసుకుంటే ‘అన్ లిమిటెడ్’ ప్రయోజనాలు.. కాల్స్, డేటా, ఓటీటీ మరెన్నో..

ఇటీవల కాలంలో వీఐ మళ్లీ ఫాంలోకి వచ్చింది. వోడాఫోన్ ఐడియా మెర్జ్ అయ్యాక వాటి సేవల్లో నాణ్యత పెరిగింది. పైగా వినియోగదారులకు ఆకర్షించేందుకు అనువైన ధరల్లో అధిక ప్రయోజనాలతో కూడిన ప్లాన్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో 84 రోజుల వ్యాలిడిటీతో వీఐ పలు ప్లాన్లను లాంచ్ చేసింది. వాటిల్లో అపరిమిత కాలింగ్ తో పాటు డేటా, ఎస్ఎంఎస్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ అందుబాటులో ఉంటున్నాయి.

Vi Recharge Plans: వీటితో రీచార్జ్ చేసుకుంటే ‘అన్ లిమిటెడ్’ ప్రయోజనాలు.. కాల్స్, డేటా, ఓటీటీ మరెన్నో..
Vodafone Idea Recharge Plans
Follow us
Madhu

|

Updated on: Feb 14, 2024 | 6:53 AM

15 రోజులకో, నెలకో రీచార్జ్ చేసుకుంటుండటం వినియోగదారులకు ఇబ్బందిగా ఉంటోంది. అందుకే లాంగ్ టర్మ్ ప్లాన్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వీఐ(వొడాఫోన్ ఐడియా) ఎక్కువ కాలం వ్యాలిడిటీతో ప్లాన్లను అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో వీఐ మళ్లీ ఫాంలోకి వచ్చింది. వోడాఫోన్ ఐడియా మెర్జ్ అయ్యాక వాటి సేవల్లో నాణ్యత పెరిగింది. పైగా వినియోగదారులకు ఆకర్షించేందుకు అనువైన ధరల్లో అధిక ప్రయోజనాలతో కూడిన ప్లాన్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో 84 రోజుల వ్యాలిడిటీతో వీఐ పలు ప్లాన్లను లాంచ్ చేసింది. వాటిల్లో అపరిమిత కాలింగ్ తో పాటు డేటా, ఎస్ఎంఎస్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఆ ప్లాన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

వీఐ 84 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లు..

వీఐ రూ 459.. ఈ ప్లాన్ ఈ టెల్కో నుంచి వస్తున్న చవకైన 84 రోజుల ప్లాన్. దీనిలో 6జీబీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది. డేటా వినియోగం పై రోజువారీ పరిమితి లేదు. ఈ ప్లాన్లో ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత కాల్‌లు, సినిమాలు, టీవీ వంటి ప్రయోజనాలతో వస్తుంది. అలాగే మొత్తం 1000ఎస్ఎంఎస్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

వీఐ రూ. 719.. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ప్రతి రోజూ 1.5జీబీ హై-స్పీడ్ రోజువారీ డేటాను అందిస్తుంది. కస్టమర్‌లు ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత కాల్‌లు, వీఐ సినిమాలు, టీవీ వంటి ప్రయోజనాలను పొందుతారు. ‘బింగే ఆల్ నైట్’ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇక్కడ కస్టమర్‌లు ప్యాక్ తో సంబంధం లేకుండా అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చు. వారాంతంలో ఉపయోగించని డేటాను యాక్సెస్ చేయగల వారాంతపు డేటా రోల్‌ఓవర్ 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందొచ్చు. ప్రతి నెల అదనపు ఖర్చు లేకుండా. కస్టమర్‌లు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లను కూడా పొందుతారు.

ఇవి కూడా చదవండి

వీఐ రూ. 839.. ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్‌లు ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటాను పొందుకోవచ్చు. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్‌లు, వీఐ సినిమాలు, టీవీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. వీకెండ్ డేటా రోల్‌ఓవర్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా వీఐ అందిస్తోంది. వీకెండ్‌లో ఉపయోగించని డేటా అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు ప్యాక్ మినహాయింపు లేకుండా అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అపరిమిత డేటాను పొందే ‘బింగే ఆల్ నైట్’ ను పొందొచ్చు. ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా వినియోగించుకోవచ్చు. 3-నెలల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లను కూడా పొందుతారు.

వీఐ రూ. 1,066.. ఈ ప్లాన్లో 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్‌లు, వీఐ సినిమాలు, టీవీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కస్టమర్‌లు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. అదనపు ఖర్చు లేకుండా ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా, వారాంతానికి ఉపయోగించని డేటా అందుబాటులో ఉండే వారాంతపు డేటా రోల్‌ఓవర్, అర్థరాత్రి 12 గంటల నుంచి 6 గంటల మధ్య అపరిమిత డేటాను పొందే ‘బింగే ఆల్ నైట్’ వంటి అదనపు ప్రయోజనాలను కూడా వీఐ అందిస్తోంది. ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC