Jio Recharge Plan: జియో కస్టమర్లకు నాన్ స్టాప్ వినోదం.. కొత్త రీచార్జ్ ప్లాన్ తో అదిరే ప్రయోజనాలు..!

క్రికెట్, సినిమాలు, టీవీ షోలు, పాటలు, చరిత్ర .. ఇలా ఏది తెలుసుకోవాలన్నా మన ఫోన్ ఆన్ చేస్తే చాలు. ప్రపంచంలోని సమాచారమంతా చిటికెలో ముందుంటుంది. మన పని చేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడు నచ్చిన సినిమా చూడొచ్చు. పాటలు వినవచ్చు. కారు లేదా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బోర్ కొట్టకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. అయితే ఇవన్నీ చేయడానికి స్మార్ట్ ఫోన్ లో డేటా చాలా అవసరం.

Jio Recharge Plan: జియో కస్టమర్లకు నాన్ స్టాప్ వినోదం.. కొత్త రీచార్జ్ ప్లాన్ తో అదిరే ప్రయోజనాలు..!
Jio Recharge Plan
Follow us

|

Updated on: May 24, 2024 | 1:45 PM

ఆధునిక కాలంలో వినోదం అంతా మన చేతిలోని స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయింది. క్రికెట్, సినిమాలు, టీవీ షోలు, పాటలు, చరిత్ర .. ఇలా ఏది తెలుసుకోవాలన్నా మన ఫోన్ ఆన్ చేస్తే చాలు. ప్రపంచంలోని సమాచారమంతా చిటికెలో ముందుంటుంది. మన పని చేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడు నచ్చిన సినిమా చూడొచ్చు. పాటలు వినవచ్చు. కారు లేదా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బోర్ కొట్టకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. అయితే ఇవన్నీ చేయడానికి స్మార్ట్ ఫోన్ లో డేటా చాలా అవసరం.

జియో 90 జీబీ డేటా ప్లాన్..

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ టెలికాం కంపెనీలు డేటా అందిస్తున్నాయి. వాటిలో మనకు అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా జియో కంపెనీ 28 రోజుల వ్యవధితో 90 జీబీ డేటాను ప్లాన్ అందిస్తుంది. దీని ద్వారా ఉచిత ఓటీటీ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ వివరాలు, ఉపయోగాలు తెలుసుకుందాం.

అద్భుతమైన ప్యాక్..

గతంలో స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్ చూసేవాళ్లం. చదువుకు సంబంధించి గూగుల్ లో సెర్చ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిధి పెరిగింది. ఆన్‌లైన్ లోనే క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నాం. ఓటీటీ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. టీవీ జోలికి వెళ్లనవసరం లేకుండా అన్ని ప్రోగ్రామ్ లు స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేశాయి. వీటికి అనుగుణంగానే డేటా కూడా ఉండాలి. జియో ఇస్తున్న కొత్త ప్లాన్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అద్భుతమైన డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్యాక్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి అందుబాటు ధరలలో ఉండడంతో పాటు పూర్తి ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్యాక్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడతాయి.

ఇవి కూడా చదవండి

రూ.399 ప్లాన్..

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులు మొబైల్‌లో ఎక్కువ డేటాను కోరుకుంటున్నారు. జియో తన కస్టమర్లకు రూ.399 ప్లాన్‌ని అందిస్తోంది. దీనిలో రోజువారీ డేటాతో పాటు, అదనపు ఉచిత డేటాను కూడా ఇచ్చింది. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లను, ఓటీటీ కంటెంట్‌ను వీక్షించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

28 రోజుల వ్యాలిడిటీ..

ఈ ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. మరో 6 జీబీ కూడా ఉచితంగా లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఈ ప్లాన్‌తో కంపెనీ మొత్తం 90 జీబీ డేటాను అందిస్తోంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ లో మరో ప్రత్యేకత ఏమిటంటే మీకు అపరిమిత 5 జీ డేటా లభిస్తుంది.

మరిన్ని ప్రయోజనాలు..

జీయో కొత్త ప్లాన్ తో మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్‌లకు సభ్యత్వం లభిస్తుంది. జియో టీవీలో అనేక రకాల ప్రోగ్రామ్‌లు చూడవచ్చు. జియో సినిమాలో వివిధ సినిమాలు, టీవీ షోలు, క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..