Infinix Note 40 Pro: రూ. 20 వేలలో వైర్‌లెస్‌ ఛార్జర్‌తో పాటు మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్‌..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ ఇటీవల మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను తక్కువ ధరలోనే అధునాతన పీచర్లతో తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో అంతలా ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత.? ఉంది లాంటి వివరాలు మీకోసం.. ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లో ఉండే డైనమిక్‌ ఐల్యాండ్‌ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో....

Infinix Note 40 Pro: రూ. 20 వేలలో వైర్‌లెస్‌ ఛార్జర్‌తో పాటు మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్‌..
Infinix Note 40 Pro
Follow us

|

Updated on: May 24, 2024 | 2:42 PM

మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో బడ్జెట్‌ అనుకూలించక ఏదో నార్మల్‌ ఫోన్‌తో సరిపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అలాంటి ఓ సూపర్ స్మార్ట్ ఫోన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ ఇటీవల మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను తక్కువ ధరలోనే అధునాతన పీచర్లతో తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో అంతలా ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత.? ఉంది లాంటి వివరాలు మీకోసం.. ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లో ఉండే డైనమిక్‌ ఐల్యాండ్‌ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్‌కు ఛార్జింగ్ కేబుల్‌ను కనెక్ట్ చేయగానే స్క్రీన్‌పై ఛార్జింగ్‌ అవుతున్నట్లు అడ్డంగా ఓ చిన్న డిస్‌ప్లే కనిపిస్తుంది. అలాంటి ఫీచర్‌ను ఇన్‌ఫినిక్స్‌ ఫోన్‌లో ఇచ్చారు.

అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి అచ్చంగా ఐఫోన్‌ 15కి ఉపయోగించే మ్యాక్స్‌ సేఫ్‌ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్‌ ఈ ఫోన్‌ను వైర్‌లెస్‌ ఛార్జర్‌తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్లున్న ఐఫోన్‌ 15ప్రో మ్యాక్స్‌ స్మార్ట్ ఫోన్‌ ధర సుమారు రూ. లక్షన్నరగా ఉంటుంది. అయితే ఇవన్నీ ఫీచర్లతో వచ్చిన ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో ఉండడం విశేషం. ఇక ఈ ఫోన్‌లో ఉన్న మిగతా ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 27,999కాగా 21 శాతం డిస్కౌంట్‌తో రూ. 21,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్‌ పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..