Smart TVs: బడ్జెట్ ధరల్లో సూపర్ స్మార్ట్ టీవీలు.. రూ.10 వేల లోపు ది బెస్ట్ టీవీలు ఇవే
భారతదేశంలోని వినోద రంగ అభివృద్ధికి టీవీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో టీవీల పని తీరులో బోలెడన్ని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలు టీవీ మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పని చేసే స్మార్ట్ టీవీలు వినియోగించడానికి వీలుగా ఉండడంతో పాటు నెట్ వర్క్‌ను కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంది. అందువల్ల్ ఏదైనా ప్రోగ్రామ్‌లు చూడడం మిస్ అయినా యూ ట్యూబ్‌లో మనకు అనువైన సమయంలో చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ టీవీల ధరలు అధికంగా ఉండడంతో సగటు మధ్యతరగతి కుటుంబ ఈ టీవీల కొనుగోలుకు వెనుకడుగు వేస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో చాలా టీవీలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రూ.10 వేల లోపు అందుబాటులో ఉండే టాప్ స్మార్ట్ టీవీల గురించి తెలుసుకుందాం.