AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Detox Benefits: డిజిటల్ డిటాక్స్.. వారం రోజులు ఫోన్ బంద్ చేస్తే జరిగే పరిణామాలు ఇవేనట.. తెలిస్తే అబ్బ అనాల్సిందే..

టెక్నాలజీ మన జీవితాలపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.. ప్రస్తుత కాంలో స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఉదయాన్నే ఫోన్‌ని చెక్ చేయడం, నిద్రపోయే ముందు స్క్రోలింగ్ చేయడం, నోటిఫికేషన్‌ల చిరుజల్లు - ఇవన్నీ మనకు అనుక్షణం అలవాటయ్యాయి.

Digital Detox Benefits: డిజిటల్ డిటాక్స్.. వారం రోజులు ఫోన్ బంద్ చేస్తే జరిగే పరిణామాలు ఇవేనట.. తెలిస్తే అబ్బ అనాల్సిందే..
Digital Detox
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2024 | 2:46 PM

Share

టెక్నాలజీ మన జీవితాలపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.. ప్రస్తుత కాంలో స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఉదయాన్నే ఫోన్‌ని చెక్ చేయడం, నిద్రపోయే ముందు స్క్రోలింగ్ చేయడం, నోటిఫికేషన్‌ల చిరుజల్లు – ఇవన్నీ మనకు అనుక్షణం అలవాటయ్యాయి. అయితే, మీరు మీ ఫోన్‌ను వారం రోజులపాటు పూర్తిగా దూరంగా ఉంచితే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో డిజిటల్ డిటాక్స్ అనే పదం చాలా చర్చనీయాంశమైంది. దీని అర్థం డిజిటల్ పరికరాలకు, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియాకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలి. స్థిరమైన స్క్రీన్ సమయం, ఆన్‌లైన్ ఉనికి మన మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే., డిజిటల్ డిటాక్స్ పాటించాలంటూ పలువురు సూచిస్తున్నారు.

డిజిటల్ ప్రపంచానికి నిరంతరం కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్ర సమస్యలు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ డిటాక్స్ ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అయితే, ఫోన్‌ను వారం రోజుల పాటు పూర్తిగా దూరంగా ఉంచడం అందరికీ అంత సులభం కాదు. ప్రారంభంలో, అశాంతి, నోటిఫికేషన్లు తప్పిపోతామనే భయం లేదా పనిలో ఏదైనా సమస్యల ఏర్పడతాయేమోనన్న భయం లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది.

డిజిటల్ డిటాక్స్ ప్రయోజనాలు ఏమిటి?

  • మానసిక ప్రశాంతత: నిరంతర వార్తల ఫీడ్, నోటిఫికేషన్‌లు లేకపోవడం మన మనస్సుకు ఉపశమనాన్ని అందిస్తాయి.
  • ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది: ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల ఇతర పనులు చేయడంలో ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతుంది.
  • మెరుగైన నిద్ర: నిద్రపోయే ముందు ఫోన్ ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. డిజిటల్ డిటాక్స్ నిద్రను మెరుగుపరుస్తుంది.
  • వాస్తవ ప్రపంచానికి కనెక్షన్: ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పర్యావరణంతో అనుబంధం బలపడుతుంది.

మీరు డిజిటల్ డిటాక్స్‌ని ప్రయత్నించాలనుకుంటే, మీరు తీసుకోవలసిన కొన్ని సాధారణ దశలు ఇవే..

  1. మీ ఫోన్‌ను దూరంగా ఉంచడానికి నిర్ణీత సమయాన్ని కేటాయించండి. ఉదాహరణకు, రాత్రిపూట లేదా డిన్నర్ సమయంలో మీ ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో ఉంచండి.
  2. నిద్రించడానికి కనీసం గంట ముందు ఫోన్ ను దూరంగా ఉంచండి.
  3. మీరు తక్కువగా ఉపయోగించే యాప్‌లను తొలగించండి.
  4. మీరు డిజిటల్ డిటాక్స్‌లో ఉన్నారని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పండి.
  5. ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి.
  6. పుస్తకాలు చదవండి లేదా కొత్త అభిరుచిని అనుసరించండి.

డిజిటల్ డిటాక్స్ అనేది మీ ఫోన్‌ను పూర్తిగా వదులుకోవడం కాదు, కానీ ఇది డిజిటల్ ప్రపంచంపై మీ ఆధారపడటాన్ని తగ్గించడానికి.. మీ జీవితాన్ని నియంత్రించడానికి ఒక మార్గం..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..