తమలపాకు గురించి నమ్మలేని నిజాలు.. రోజుకు ఒక్కటి తిన్న చాలు

తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలున్నాయి. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి. తమలపాకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, తమలపాకును తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే.. దాన్ని మరిగించిన నీటిని తాగడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తమలపాకు గురించి నమ్మలేని నిజాలు.. రోజుకు ఒక్కటి తిన్న చాలు

|

Updated on: May 23, 2024 | 2:01 PM

తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలున్నాయి. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి. తమలపాకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, తమలపాకును తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే.. దాన్ని మరిగించిన నీటిని తాగడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. ఒక గ్లాసు నీటిలో ఒక తమలపాకును ముక్కలు చేసి.. వాటిని నీటిలో 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. దీనివల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. పేగు కదలికలు బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది. తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంవల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహం నియంత్రణలో కూడా తమలపాకు నీరు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా, మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తమలపాకు నీరు నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఆస్తమాను అదుపులో ఉంచుతాయి. అంతేగాక తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తమలపాకు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.అయితే తమలపాకు నీటిని ఎప్పుపడితే అప్పుడు తాగడం కూడా మంచిదికాదు. రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఇప్పడు మనం చెప్పుకున్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని అనుసరించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడ వేషంలో మగ దొంగలు !! తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌

క్యాన్సర్‌ని తరిమికొట్టే అద్భుత ఫలం.. ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి

అంత్యక్రియలకు రూ.30 లక్షలు.. అనాథ శవాల్లా వదిలేస్తున్న ప్రజలు

మనిషి మెదడులో అమర్చిన ఇంప్లాంట్ పనిచేస్తోందోచ్‌

వరంగల్ లో చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్లిన యువతి

Follow us
Latest Articles
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్