AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: సోనూసూద్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్.. ఈ తప్పులు చేస్తే మీ పరిస్థితి అంతే.. 61 గంటల్లో ఎన్ని మెసేజ్‌లు వచ్చాయో తెలిస్తే మతిపోతుంది

Soonu Sood Whatsapp Blocked: ప్రముఖ నటుడు సోనూసూద్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. 61 గంటల తర్వాత అతని వాట్సాప్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ బ్లాక్‌ అయిన 61 గంటల్లో మొత్తం 9483 సందేశాలు నిలిచిపోయాయి. సహాయం కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా అతడిని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది తమ అకౌంట్ క్లోజ్ అయిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు...

Sonu Sood: సోనూసూద్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్.. ఈ తప్పులు చేస్తే మీ పరిస్థితి అంతే.. 61 గంటల్లో ఎన్ని మెసేజ్‌లు వచ్చాయో తెలిస్తే మతిపోతుంది
Sonu Sood
Subhash Goud
| Edited By: |

Updated on: May 01, 2024 | 3:50 PM

Share

Sonu Sood Whatsapp Blocked: ప్రముఖ నటుడు సోనూసూద్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. 61 గంటల తర్వాత అతని వాట్సాప్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ బ్లాక్‌ అయిన 61 గంటల్లో మొత్తం 9483 సందేశాలు నిలిచిపోయాయి. సహాయం కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా అతడిని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది తమ అకౌంట్ క్లోజ్ అయిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ అయిన తన వాట్సాప్ అకౌంట్ 61 గంటల్లో మాళ్లీ మామూలు అయిపోయిందని, చదవని మెసేజ్‌లు కూడా మళ్లీ రీస్టోర్ అయ్యాయని సోనూ సూద్ ట్వీట్ చేశారు.

అయితే ఎంతో మందికి సాయం చేసిన సోనూ వాట్సాప్‌ బ్లాక్‌ కావడంతో ఇబ్బందిగా మారిపోయింది. తన వాట్సాప్‌ అకౌంట్ బ్లాక్ అయ్యింది. ఇదే విషయంపై పలుమార్లు వాట్సాప్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడా వాళ్లు పట్టించుకోలేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో తనను సంప్రదించాలి అనుకునేవారికి కష్టమవుతుందని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు 61 గంటల తర్వాత వాట్సాప్‌ యాక్సెస్ దొరికిందని సోనూసూద్‌ తెలిపారు.

వాట్సాప్ నిషేధంపై సోనూసూద్ సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు. వాట్సాప్‌లో నా నంబర్ బ్లాక్ చేయబడింది. నేను ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నాను. వాట్సాప్ ఇప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని నేను భావిస్తున్నాను, ”అని ఆయన ట్వీట్ చేశారు. తర్వాత వాట్సాప్ ఓకే అని తెలియజేశాడు.

వాట్సాప్ ఎందుకు నిషేధించబడింది?

  1. మీరు వాట్సాప్‌ నిబంధనలు, షరతులను ఉల్లంఘిస్తే, కంపెనీ మీ ఖాతాను నిషేధిస్తుంది. అప్పుడు మీరు వాట్సాప్‌ని ఉపయోగించలేరు.
  2. వాట్సాప్‌ కోసం ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను ఉపయోగించవద్దు. GB WhatsApp, WhatsApp Plus, WhatsApp Delta వంటి యాప్‌లను ఉపయోగించడం ద్వారా మీ వాట్సాప్‌ బ్లాక్ చేయవచ్చు.
  3. మీరు మరొక వ్యక్తి ప్రైవేట్ సమాచారంతో వాట్సాప్‌ ఖాతాను సృష్టించినట్లయితే, అటువంటి ఖాతాపై చర్య తీసుకోవచ్చు. మీరు మీ వివరాలతో వాట్సాప్‌ ఉపయోగించవచ్చు.
  4. అసభ్యకరమైన సందేశం పంపడం, తెలియని వ్యక్తికి బెదిరింపు సందేశాలు పంపడం కూడా ఖర్చుతో కూడుకున్నది. సందేశాన్ని అందుకున్న వ్యక్తి మీ ఖాతాను నివేదించడం ద్వారా మీకు సమస్య రావచ్చు.
  5. వాట్సాప్‌లో అసభ్యకరమైన ఫోటో-వీడియో లేదా బెదిరింపు సందేశాలు పంపడం నిబంధనలకు విరుద్ధం. అప్పుడు కూడా మీ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి