AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules: మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా? కొత్త నిబంధనలు

కొత్త సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచాయి. అయితే ఏప్రిల్ 30న ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇది మొదటి నెల. సామాన్య ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అనేక నిబంధనలలో మే 1 నుంచి కొన్ని అంశాలలో నిబంధనలు మారనున్నాయి. ఈరోజు నుండి ఐసిఐసిఐ బ్యాంక్ పొదుపు ఖాతాలపై ఛార్జీలలో ఎల్‌పిజి సిలిండర్ ధరలో అనేక మార్పులు కనిపిస్తాయి..

New Rules: మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా? కొత్త నిబంధనలు
May 1st New Rules
Subhash Goud
|

Updated on: May 01, 2024 | 7:28 AM

Share

కొత్త సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచాయి. అయితే ఏప్రిల్ 30న ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇది మొదటి నెల. సామాన్య ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అనేక నిబంధనలలో మే 1 నుంచి కొన్ని అంశాలలో నిబంధనలు మారనున్నాయి. ఈరోజు నుండి ఐసిఐసిఐ బ్యాంక్ పొదుపు ఖాతాలపై ఛార్జీలలో ఎల్‌పిజి సిలిండర్ ధరలో అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ నెలలో డబ్బు సంబంధిత నియమాలలో ఎలాంటి మార్పులు చూడవచ్చో తెలుసుకుందాం.

యెస్ బ్యాంక్ కీలక నిర్ణయం

యెస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్‌లో మార్పులు జరిగాయి. ఇప్పుడు యెస్ బ్యాంక్ ప్రో మాక్స్ సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ రూ.50,000కి మార్చింది. గరిష్ట ఛార్జీ రూ.1000కి మార్చబడింది. ప్రో ప్లస్, యస్ రెస్పెక్ట్ ఎస్‌ఏ, యెస్ ఎసెన్స్ ఎస్‌ఏ ఖాతాల కోసం, కనీస సగటు బ్యాలెన్స్ పరిమితి రూ.25,000, గరిష్ట ఛార్జీ రూ.750. ఖాతా ప్రోలో కనీస నిల్వ రూ.10,000, దానిలో గరిష్ట ఛార్జీ రూ. 750.

ఇవి కూడా చదవండి

మీ జేబులపై ప్రభావం

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సేవింగ్ కార్డులకు సంబంధించిన నిబంధనలను మార్చబోతోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు డెబిట్ కార్డు కోసం రూ.99, పట్టణ ప్రాంతాల్లో రూ.200 వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు, 25 పేజీల చెక్ బుక్‌లకు ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని బ్యాంక్ నిర్ణయించింది. అయితే ఆ తర్వాత చెక్ బుక్‌లోని ప్రతి పేజీకి రూ.4 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవీకి IMPS లావాదేవీ మొత్తం రూ. 2.50 నుండి రూ. 15 వరకు నిర్ణయించింది.

ప్రత్యేక ఎఫ్‌డీ చివరి తేదీ గురించి..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేరాలంటే మే 10 వరకు చేరవచ్చు. ఈ పథకంలో సీనియర్ సిటిజన్‌లకు 0.75% అదనపు వడ్డీ రేటు అందుబాటులో ఉంది. దీని ద్వారా వారు 5 నుండి 10 సంవత్సరాల ఎఫ్‌డీ పథకంపై 7.75% వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు.

ప్రతి నెలా ఒకటవ తేదీన, చమురు కంపెనీలు గృహ, వాణిజ్య ఎల్‌ఫీజీ గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు వస్తాయన్న విషయం అందరికి తెలిసిందే.ద అందుకే మే మొదటి తేదీన గ్యాస్ ధరలలో మార్పు జరిగాయి. డోమెస్టిక్‌ సిలిండర్‌ ధరపై రూ.19 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి