AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..! తగ్గనున్న సొమ్ము..

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. పీఎఫ్ వడ్డీ రేట్లలో కొత విధించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. త్వరలో దీనిని తగ్గించనున్నారని సమాచారం. వచ్చే నెలలో ఈ ప్రకటన రానుంది.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..! తగ్గనున్న సొమ్ము..
Epfo
Venkatrao Lella
|

Updated on: Feb 17, 2026 | 8:47 AM

Share

ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ అందించనుంది. పీఎఫ్ బ్యాలెన్స్‌ మొత్తంపై కేంద్ర ప్రభుత్వం వార్షిక వడ్డీ రేటును అందిస్తూ ఉంటుంది. కానీ ఈ సారి వడ్డీ రేటులో కేంద్రం కొత పెట్టనుందని తెలుస్తోంది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ప్రకటించింది. కానీ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇంకా ఎంత వడ్డీ ఇస్తామనేది ప్రకటించలేదు. త్వరలోనే ఈ వడ్డీ రేట్లను ప్రకటించనుండగా.. ఈ సారి తగ్గించనుందని సమాచారం. త్వరలో జరగనున్న ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి షాక్ అని చెప్పవచ్చు.

ఎంత తగ్గించే అవకాశం ఉందంటే..?

2025-26 ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ రేటు 8 నుంచి 8.20 శాతంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.25 శాతంగా ఉండగా.. ఇందులో కొత విధించనున్నారని సమాచారం. ఈపీఎఫ్‌వోకు సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు వడ్డీ రేటును నిర్ణయిస్తూ ఉంటాయి. మార్చిలో ఈ ట్రస్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లను నిర్ణయించి కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదానికి పంపుతారు. ఆర్ధికశాఖ అనుమతి ఇచ్చిన అనంతరం ఈపీఎఫ్‌వో అధికారికంగా వడ్డీ రేట్ల గురించి ప్రకటన విడుదల చేస్తుంది.

పీఎఫ్ వడ్డీ లెక్కింపు ఎలా..?

నెలవారీ ప్రాతిపదికన ఈపీఎఫ్ వడ్డీను లెక్కిస్తారు. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వీటిని జమ చేస్తారు. ఉదాహరణకు వార్షిక వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంటే.. నెలవారీ రేటు సుమారు 0.688 శాతంగా ఉంటుంది. ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలో 12 శాతం ఈపీఎఫ్‌కు జమ చేస్తారు. యజమాని వాటా 12 శాతం ఉంటుంది. ఇది రెండు భాగాలుగా విభజించబడింది. ఇందులో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)లో జమ చేస్తారు. ఇది నెలకు గరిష్టంగా రూ. 1,250 వరకు ఉంటుంది. ఇక మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఇప్పుడు వడ్డీ తగ్గించడం వల్ల పీఎఫ్ సేవింగ్స్‌పై వచ్చే వడ్డీ గత ఏడాది కంటే తక్కువగా వస్తుంది.

త్వరలో కొత్త యాప్

అటు ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో కొత్త యాప్ రానుంది. ఈ యాప్‌లో యూపీఐ ద్వారా మనీ విత్ డ్రా చేసుకునే సౌకర్యంతో పాటు పాస్ బుక్ డీటైల్స్ చేసుకోవచ్చు. ఇక క్లెయిమ్స్ చాలా వేగంగా పరిష్కారం అవుతాయి. అలాగే ఉద్యోగులు ఫిర్యాదు చేయడానికి ఆప్షన్ ఉంటుంది. వేగంగా ఫిర్యాదులు పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఈ యాప్‌లో పీఎఫ్‌ సేవలు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉండనున్నాియ.

Follow Us
Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..
Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?