AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వు నిజంగా దేవుడివి స్వామి..! 500 మందికి క్యాన్సర్‌ చికిత్స చేయించిన హీరో..

సామాజిక సేవ చేస్తూ ఎంతో మంది హీరోలు అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు. స్టార్ హీరోలు సినిమాలతో పాటు ప్రజలకు సేవలు చేస్తూ ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ హీరో 500 మహిళలలకు క్యాన్సర్ చికిత్స చేయించారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?

నువ్వు నిజంగా దేవుడివి స్వామి..! 500 మందికి క్యాన్సర్‌ చికిత్స చేయించిన హీరో..
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2025 | 1:06 PM

Share

కొంతమంది స్టార్ హీరోలు సినిమాలతో పాటు సామాజిక సేవలు కూడా చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలు సామాజిక సేవ చేస్తున్నారు. మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు ప్రజలకు సేవలు చేస్తున్నారు. మహేష్ బాబు 1500మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించారు.. ఇంకా చేయిస్తున్నారు కూడా.. అలాగే చిరంజీవి బ్లెడ్ బ్యాంక్, ఐ డొనేషన్ ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే బాలయ్య బాబు బసవతారకం హాస్పటల్ ద్వారా క్యాన్సర్ రోజులకు వైద్యం అందిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో కూడా తమ మంచి మనసు చాటుకున్నారు. 500 మందికి క్యాన్సర్‌ చికిత్స చేయించారు. ఇంతకూ ఆ హీరో ఎవరంటే..

విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?

రీల్ లైఫ్ లో ఎక్కువగా విలన్ గా కనిపించే సోనూసూద్ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. కరోనా ఆపత్కాలంలో అతను అందించిన సేవలు, సహాయక కార్యక్రమాలు, దాన ధర్మాలను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆ తర్వాత కూడా సోనూ సేద్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సహాయక కార్యక్రమాలు చేస్తున్నాడీ రియల్ హీరో. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేశాడు సోనూ సూద్.

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. మరో వైపు ఫిజయో థెరపిస్ట్.. ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా.?

కష్టంలో ఉన్నాం అని ఎవరైనా చెప్తే చాలు వారికి సేవ చేయడంలో ముందుంటాడు సోనూ సూద్. 500 మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ చికిత్స చేయించారు సోనూ సూద్. దీని పై సోనూ సూద్ గురించి మాట్లాడుతూ.. మేం 500 మంది మహిళలను మేం కాపాడగలిగాం. 500 మందికి రొమ్ము క్యాన్సర్‌ చికిత్స జరిగింది. వాళ్ళందరూ కొత్త జీవితాన్ని పొందారు. వారి కుటుంబాల్లో ఆనందం నింపినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను. సమష్టి కృషి( సోనూ సూద్ ఫౌండేషన్) ద్వారా ఈ ఇలాంటి గొప్ప పనులు మరిన్ని జరుగుతున్నాయి అని తెలిపారు సోనూ సూద్.

ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..! 7/G బృందావన్ కాలనీ మిస్ అయిన హీరో.. ఆయన చేసుకుంటే మరోలా ఉండేది

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..