జేమ్స్ కామెరాన్, ఎస్‌ఎస్ రాజమౌళి ముచ్చట్లు.. అవతార్: ఫైర్ అండ్ యాష్‌పై ఆసక్తికర చర్చ
కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు..దేశంతో కూడా పనుండదు… అందులో జేమ్స్ కామెరూన్ ఒకరు. పేరుకు హాలీవుడ్ డైరెక్టరే అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి ఆయన సినిమాలు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫ్రాంచైజ్‌గా నిలిచిన ‘అవతార్’ సిరీస్ మూడో భాగం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ ఈ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ప్రపంచ సినిమా దర్శక దిగ్గజులు జేమ్స్ కామెరాన్, ఎస్‌ఎస్ రాజమౌళి కలిసి అవతార్ ఫ్రాంచైజీలో రాబోతున్న చిత్రం అవతార్: ఫైర్ అండ్ ఆష్ గురించి చర్చించారు. ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఇద్దరూ లెజెండ్రీ డైరెక్టర్స్ కలిసి అవతార్ గురించి చేసిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. అవతార్ గురించి రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే జేమ్స్ కామెరాన్ అవతార్ ఫ్రాంచైజీ గురించి వివరాలు, విశేషాలు పంచుకున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?
రాజమౌళి మాట్లాడుతూ.. అవతార్: ఫైర్ అండ్ యాష్ చూసినప్పుడు థియేటర్‌లో పిల్లవాడిలా చూస్తుండిపోయాను అని చెప్పుకొచ్చారు. కామెరాన్ సినిమాటిక్ స్పెక్టాకిల్‌ను మరింత అభివృద్ధి చేస్తూనే భావోద్వేగాలను కేంద్రంగా ఉంచడాన్ని ప్రశంసించారు రాజమౌళి. హైదరాబాద్‌లో అవతార్ ఐమాక్స్‌లో ఏడాది పాటు ప్రదర్శించబడిందని రాజమౌళి తెలిపారు . అవతార్ ఫ్రాంచైజీ ఇమ్మర్సివ్ బిగ్ స్క్రీన్ అనుభవాలకు బెంచ్‌మార్క్‌గా ఉందని రాజమౌళి అన్నారు.
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. మరో వైపు ఫిజయో థెరపిస్ట్.. ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా.?
కామెరాన్ కూడా రాజమౌళి సినిమాటిక్ విజన్‌ను అభినందించి, భారతీయ దర్శకుడి ఫిల్మ్ సెట్‌ను సందర్శించాలని కోరిక వ్యక్తం చేశారు. 20th సెంచరీ స్టూడియోస్ నుంచి అవతార్: ఫైర్ అండ్ ఆష్ డిసెంబర్ 19న భారతదేశంలో ఏకంగా 6 భాషల్లో (ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ) విడుదల కానుంది. ఈ సినిమా కోసం సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. వారణాసి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..! 7/G బృందావన్ కాలనీ మిస్ అయిన హీరో.. ఆయన చేసుకుంటే మరోలా ఉండేది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








