టాలీవుడ్‌లో విషాదం.. కేడీ మూవీ దర్శకుడు కిరణ్ కుమార్ హఠాన్మరణం
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశారు. కిరణ్ కుమార్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన కేడీ సినిమాకు దర్శకత్వం వహించారు. 2010లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు కిరణ్ కుమార్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశారు. కిరణ్ కుమార్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన కేడీ సినిమాకు దర్శకత్వం వహించారు. 2010లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు కిరణ్ కుమార్. ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదలకానుంది. ఈ సమయంలో కిరణ్ కుమార్ మరణించడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
కిరణ్ కుమార్ (కేకే) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కిరణ్ కుమార్ మరణవార్త తెలిసి పలువురు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. కేడీ సినిమా కంటే ముందు కిరణ్ కుమార్ పలు సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కిరణ్ కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








