Bank Holidays May 2024: కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌

మేలో నాలుగు దశల ఎన్నికలతో సహా మొత్తం 14 రోజుల బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం 11 సెలవులు ఉన్నాయి. కర్ణాటకలో మే 7న 3వ దశ ఎన్నికల నేపథ్యంలో కొన్ని చోట్ల సెలవులు ఉండనున్నాయి. బసవ జయంతి, బుద్ధ పూర్ణి, కార్మిక దినోత్సవం సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలలో సెలవులు..

Bank Holidays May 2024: కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
Bank Holidays
Follow us
Subhash Goud

|

Updated on: May 01, 2024 | 8:40 AM

మేలో నాలుగు దశల ఎన్నికలతో సహా మొత్తం 14 రోజుల బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం 11 సెలవులు ఉన్నాయి. కర్ణాటకలో మే 7న 3వ దశ ఎన్నికల నేపథ్యంలో కొన్ని చోట్ల సెలవులు ఉండనున్నాయి. బసవ జయంతి, బుద్ధ పూర్ణి, కార్మిక దినోత్సవం సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలలో సెలవులు ఉన్నాయి. క్యాలెండర్ ప్రకారం.. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలు సహా 11 రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. మే 7, 13, 20, 25 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. వివిధ రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.

మే 2024లో బ్యాంక్ సెలవుల జాబితా

  1. మే 1, బుధవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం/మహారాష్ట్ర దినోత్సవం (మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌తో సహా 11 రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవులు)
  2. మే 5: ఆదివారం
  3. మే 7, మంగళవారం: లోక్‌సభ ఎన్నికల ఫేజ్ 3 (కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో సెలవు)
  4. మే 8, బుధవారం: రవీంద్ర జయంతి (పశ్చిమ బెంగాల్‌లో సెలవు)
  5. మే 10, శుక్రవారం: బసవ జయంతి/ అక్షయ తృతీయ (కర్ణాటకలో సెలవు)
  6. మే 11: రెండవ శనివారం
  7. మే 12: ఆదివారం
  8. మే 13, సోమవారం: లోక్‌సభ ఎన్నికల 4వ దశ (జమ్మూ కాశ్మీర్‌లో సెలవు)
  9. మే 16, గురువారం: సిక్కిం రాష్ట్ర దినోత్సవం
  10. మే 19: ఆదివారం
  11. మే 20: సోమవారం (5వ దశ ఎన్నికలు)
  12. మే 23, గురువారం: బుద్ధ పూర్ణిమ (ప్రధాన నగరాల్లో సెలవు)
  13. మే 25: నాల్గవ శనివారం
  14. మే 26: ఆదివారం