Patanjali: మీ ఇంటికే పతంజలి ప్రోడక్ట్స్.. బంపర్ డిస్కౌంట్స్.. ఈ కార్డులతో డబుల్ ధమాకా..
పతంజలి ఉత్పత్తులు కొనడం ఇప్పుడు మరింత ఈజీ.. బాబా రాందేవ్ కంపెనీ తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై సబ్బుల నుంచి ఆయుర్వేద మందుల వరకు అన్నీ ఇంటి నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కొంటే 10శాతం వరకు డిస్కౌంట్, క్రెడిట్ కార్డులపై అదనంగా 10శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

యోగా గురువు బాబా రాందేవ్ కంపెనీ పతంజలి తమ వినియోగదారుల కోసం ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభతరం చేసింది. ఇకపై కస్టమర్లు షాపులకు వెళ్లకుండానే తమ ఇంటి నుంచే సబ్బులు, టూత్‌పేస్ట్, నెయ్యి, ఆయుర్వేద మందుల వంటి ఉత్పత్తులను ఇంటి నుంచే ఆర్డర్ చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నట్లే, పతంజలి అధికారిక వెబ్‌సైట్ (patanjaliayurved.net) లేదా మొబైల్ యాప్‌లో ఆర్డర్ చేయొచ్చు. గ్రామాలు, చిన్న పట్టణాల వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
ఆఫర్లు ఏమున్నాయంటే..?
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే 10శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మీ దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్-పతంజలి లేదా ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ఏకంగా 10శాతం క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. కొన్ని వస్తువులకు ఉచిత డెలివరీ కూడా ఉంది.
ఏం ఆర్డర్ చేయవచ్చు..?
పతంజలి తమ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా సబ్బులు, టూత్‌పేస్ట్, పిండి, నెయ్యి, హెర్బల్ జ్యూస్‌లు, బిస్కెట్లు, స్వీట్లు వంటి అనేక రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. దీనితో పాటు ఆయుర్వేద మందులను కూడా ఆర్డర్ చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.ఈ కొత్త ఆన్‌లైన్ సేవలు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని వినియోగదారులకు పతంజలి ఉత్పత్తులను మరింత చేరువ చేస్తాయని కంపెనీ తెలిపింది.
ఇంటి నుండి ఆర్డర్ చేయడం ఎలా?
ఆన్‌లైన్ ద్వారా పతంజలి ఉత్పత్తులను ఆర్డర్ చేయడానికి ఈ మార్గాలను అనుసరించండి:
- మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి https://www.patanjaliayurved.net (https://www.patanjaliayurved.net వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే మీ అడ్రస్, పేరు వంటి వివరాలతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వండి.
- మీకు నచ్చిన ఉత్పత్తులను సెర్చ్ చేసి, వాటిని కార్ట్‌లో యాడ్ చేయండి.
- ఆర్డర్స్ ఆప్షన్‌కు వెళ్లి అడ్రస్ ఎంచుకున్న తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేస్తే ఆర్డర్ కన్ఫార్మ్ అవుతుంది.
- కొన్ని రోజుల్లో మీ వస్తువులు మీ ఇంటికి డెలివరీ అవుతాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




