AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Pad Go: వన్‌ప్లస్‌ కొత్త ట్యాబ్‌ వచ్చేది ఆరోజే.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే..

ఇప్పటికే వన్‌ ప్లస్‌ ప్యాడ్‌ పేరుతో మార్కెట్లోకి ఓ ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చిన వన్‌ప్లస్‌.. తాజాగా మరో కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. వన్‌ప్లస్‌ ప్యాడ్‌గో పేరుతో కొత్త ట్యాబ్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్ 6వ తేదీన మార్కెట్లోకి ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేయనునున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌లో భాగంగా వన్‌ప్లస్ ఈ కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేస్తోంది. ట్విన్‌ మింట్‌ కలర్‌లో ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేయనున్నారు. ధర విషయానికొస్తే...

OnePlus Pad Go: వన్‌ప్లస్‌ కొత్త ట్యాబ్‌ వచ్చేది ఆరోజే.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే..
Oneplus Pad Go
Narender Vaitla
|

Updated on: Oct 03, 2023 | 12:24 PM

Share

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మొదట ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని వరుసగా ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత బడ్జెట్‌ ఫోన్స్‌తో యూజర్లను అట్రాక్ట్ చేసింది. అనంతరం స్మార్ట్‌ టీవీలు, స్మార్ట్ వాచ్‌లు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్యాబ్లెట్‌లను సైతం విడుదల చేస్తోంది వన్‌ప్లస్‌.

ఇప్పటికే వన్‌ ప్లస్‌ ప్యాడ్‌ పేరుతో మార్కెట్లోకి ఓ ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చిన వన్‌ప్లస్‌.. తాజాగా మరో కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. వన్‌ప్లస్‌ ప్యాడ్‌గో పేరుతో కొత్త ట్యాబ్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్ 6వ తేదీన మార్కెట్లోకి ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేయనునున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌లో భాగంగా వన్‌ప్లస్ ఈ కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేస్తోంది. ట్విన్‌ మింట్‌ కలర్‌లో ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేయనున్నారు. ధర విషయానికొస్తే రూ. 25,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచింగ్‌ తేదీ రోజే అధికారికంగా ధరతో పాటు ఫీచర్లను ప్రకటించనున్నారు.

అయితే వన్‌ప్లస్ ట్యాబ్‌ లాంచింగ్‌కు ముందే ఈ ట్యాబ్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న సమాచారం ఆధారంగా వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్‌లో 11.35 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు సమాచారం. 2.4 కే రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ట్యాబ్‌లో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్‌, 246 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ కానున్న ఈ ట్యాబ్‌లో మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఒక టిగా బైట్‌ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌లో 8000 ఎంఏహెచ్‌ వంటి పవర్‌ఫుల్ బ్యాటరీని ఇవ్వనున్నారు. యూఎస్‌బీ 2.0టైప్‌ సీ పోర్ట్‌ కనెక్టివిటీతో పనిచేసే ఈ ట్యాబ్‌లో 4జీఎల్టీఈ, వైఫై కనెక్టివటీ ఆప్షన్స్‌ను ఇవ్వనున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో వన్‌ ప్లస్‌ పాడ్‌ గో టాబ్లెట్స్‌ అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..