Ambrane Fyre: ఆంబ్రేన్ నుంచి నయా స్మార్ట్‌వాచ్.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు
ప్రముఖ పవర్‌బ్యాంక్ తయారీ కంపెనీ అయితే ఆంబ్రేన్ కూడా స్మార్ట్‌వాచ్ తయారు చేసి మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ముఖ్యంగా భారతీయ బ్రాండ్ కావడంతో మొదటి నుంచి ఆంబ్రేన్ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ. తాజాగా ఆంబ్రేన్ 2.04 అంగుళాల పెద్ద ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఫైర్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌వాచ్ భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, ఆంబ్రేన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

యువత ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్ వాడాకానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. సాధారణంగా భారతీయ వేషధారణలో వాచ్ అనేది మిళితమై ఉంటుంది. అయితే క్రమేపి సెల్‌ఫోన్ల రాకతో అందులో సమయం చూసుకునే అవకాశం ఉండడంతో వాచ్‌ల వాడకం తగ్గిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో మార్కెట్‌లో స్మార్ట్ వాచ్‌ల రావడంతో ఎక్కువ మంది వీటి వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లు బ్లూటూత్ ద్వారా స్మార్ట్ వాచ్‌కు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉండడంతో వినియోగదారులకు బోలెడన్ని సేవలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత విషయాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఈ స్మార్ట్‌వాచ్‌ల ద్వారా ఈజీగా పొందవచ్చు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌తో అన్ని కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి.
ప్రముఖ పవర్‌బ్యాంక్ తయారీ కంపెనీ అయితే ఆంబ్రేన్ కూడా స్మార్ట్‌వాచ్ తయారు చేసి మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ముఖ్యంగా భారతీయ బ్రాండ్ కావడంతో మొదటి నుంచి ఆంబ్రేన్ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ. తాజాగా ఆంబ్రేన్ 2.04 అంగుళాల పెద్ద ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఫైర్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌వాచ్ భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, ఆంబ్రేన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సమయంలో రూ. 1,599కు అందుబాటులో ఉంది. అయితే ఈ వాచ్ సాధారణ ధరరూ. 1,999. ఈ ఆంబ్రేన్ స్మార్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆంబ్రేన్ ఫైర్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు
ఆంబ్రేన్ ఫైర్ స్మార్ట్ వాచ్ 800 నిట్స్ ప్రకాశంతో 2.5డి కర్వ్డ్ గ్లాస్‌ని కలిగి ఉంది. ఈ వాచ్ డిస్ప్లే 368×448 స్క్రీన్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (ఏఓడీ) 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ వినియోగదారులకు నాలుగు రంగులలో కొనుగోలు అందుబాటులో ఉంటుంది. అన్‌పెయిర్ సాంకేతికతతో ఆధారంగా పని చేసే ఆంబ్రేనే ఫైర్ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా సౌకర్యవంతమైన కాల్ హ్యాండ్లింగ్ కోసం అంతర్నిర్మిత మైక్రోఫోన్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ మెనూలు, యాప్‌ల ద్వారా సులభంగా నావిగేషన్ చేసేందుకు వీలుగా ప్రత్యేక క్రౌన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. 100కి పైగా అనుకూలీకరించదగిన వాచ్ ఫేస్‌లు, ఐపీ 67 వాటర్-రెసిస్టెంట్ డిజైన్‌తో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్ నీరు, ధూళి బహిర్గతం కాకుండా స్థితిస్థాపకంగా ఉంటుంది.
ఈ వాచ్‌లో రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‌పీఓ2 మానిటరింగ్, బ్రీత్ ట్రైనింగ్, స్లీప్ అనాలిసిస్, హార్ట్ రేట్ అలర్ట్‌లతో పాటు అనేక ఆరోగ్య ఫీచర్ల శ్రేణితో వస్తుంది. అదనపు కార్యాచరణలలో వాయిస్ సహాయం, వాతావరణ సూచనలు, కెమెరా నియంత్రణ, కాలిక్యులేటర్, మ్యూజిక్ ప్లేబ్యాక్ నియంత్రణ, రైజ్-టు-వేక్, స్క్రీన్ టైమ్ మానిటరింగ్‌తో పాటు ఫోన్, వాచ్ లొకేటింగ్ ఫీచర్‌లు ఉన్నాయి. ఆంబ్రేన్ స్మార్ట్‌వాచ్ గూగుల్ ఫిట్‌తో పాటు యాపిల్ హెల్త్ యాపలు రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ స్మార్ట్‌వాచ్ 5 రోజుల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుందని, అలాగే హిందీ భాషా మద్దతుతో మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..