AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambrane Smart Watches: అంబ్రేన్ నుంచి అమేజింగ్ స్మార్ట్ వాచ్‪లు.. అదిరిపోయే లాంచింగ్ ఆఫర్.. మిస్ చేసుకోవద్దు..

అవుట్ డోర్ సిరీస్ గా అంబ్రేన్ తీసుకొచ్చిన స్మార్ట్ లు వైజ్ క్రెస్ట్, వైజ్ స్టడ్. వీటిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద స్క్రీన్‌, క్వాలిటీ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఏడాది కాలం పాటు వారంటీని ఆ కంపెనీ అందిస్తోంది. లాంచింగ్ ఆఫర్‌లో వీటిని కేవలం రూ.1,999కే సొంతం చేసుకోవచ్చు.

Ambrane Smart Watches: అంబ్రేన్ నుంచి అమేజింగ్ స్మార్ట్ వాచ్‪లు.. అదిరిపోయే లాంచింగ్ ఆఫర్.. మిస్ చేసుకోవద్దు..
Ambrane Smart Watches
Madhu
|

Updated on: Mar 29, 2023 | 2:30 PM

Share

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు అంబ్రేన్ (Ambrane) భారత మార్కెట్ పై కన్నేసింది. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ ల తయారీలో తను సత్తా చాటుతోంది. బడ్జెట్ ధరల్లోనే అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాచ్ లను లాంచ్ చేస్తూ.. వినియోగదారులకు ఆకర్షిస్తోంది. ఇదే క్రమంలో మరో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లను భారతదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. అవుట్ డోర్ సిరీస్ గా కంపెనీ పేర్కొంటున్న ఆ వాచ్ లపేర్లు వైజ్ క్రెస్ట్, వైజ్ స్టడ్. దీనిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద స్క్రీన్‌, క్వాలిటీ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఏడాది కాలం పాటు వారంటీని ఆ కంపెనీ అందిస్తోంది. లాంచింగ్ ఆఫర్‌లో వీటిని కేవలం రూ.2 వేలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సూపర్ ఫీచర్లు..

  • కొత్త వైజ్ క్రెస్ట్ వాచ్ స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. 500 నిట్స్ బ్రైట్‌నెస్, 360×360 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్‌ డిస్‌ప్లే రౌండ్ షేప్‌లో ఉంటుంది. 1.39-అంగుళాల లూసిడ్ డిస్‌ప్లేను దీనిలో అందించారు.
  • వైజ్ స్టడ్ స్మార్ట్‌వాచ్‌ 500 నిట్స్ బ్రైట్‌నెస్, 240×284 రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్టడ్ స్మార్ట్‌వాచ్‌ డిస్‌ప్లే స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. దీనిలో 1.85-అంగుళాల లూసిడ్ డిస్‌ప్లేను అందించారు. రెండూ మెటల్ బిల్డ్ కలిగి ఉంటాయి. ఎక్కువ కాలం మన్నే దృఢమైన గ్లాస్ ఈ రెండింటిలోనూ ఉన్నాయి. ఇంపాక్ట్ రెసిస్టెన్స్, ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్ బాడీతో ఇవి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి.
  • సిలికాన్ స్ట్రాప్‌తో వచ్చే ఈ వాచ్‌లు చర్మానికి ఎలాంటి హాని చేయవు. అలాగే వాచ్‌లను ఎప్పుడూ పొడిగానే ఉంచుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాచ్ ఫేస్‌లు సైతం వీటిలో ఆఫర్ చేశారు. ఇవి యూజర్ల దుస్తులతో వాచ్ ఫేస్ మ్యాచ్ అయ్యేలా మారతాయి. అంబ్రేన్ వైజ్ క్రెస్ట్, వైజ్ స్టడ్‌లలోని ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్లు బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ల ద్వారా కాల్స్‌ చేసుకోవడమే కాకుండా కాల్ లాగ్స్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.

ప్రత్యేక ఫీచర్లు..

వీటిలో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్ ఉన్నాయి. కాగా వైజ్ క్రెస్ట్ రక్తపోటు ను కొలిచే ఫీచర్‌ను అదనంగా కలిగి ఉంది. అయితే వైజ్ స్టడ్‌లో బీపీని కొలిచే సామర్థ్యాన్ని అందించలేదు. ఈస్టెప్స్‌, కేలరీలు, దూరాన్ని ట్రాక్ చేయవచ్చు. 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ ప్రయత్నించవచ్చు. 400ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు నిరంతర వాడకంలో గరిష్ఠంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ని ఆఫర్ చేస్తాయి. స్టాండ్ బై మోడ్‌లో 25 రోజులపాటు బ్యాకప్‌ ఇస్తాయి.

ధర ఎంతంటే..

అంబ్రేన్ వైజ్ క్రెస్ట్, వైజ్ స్టడ్ ధరలు వరుసగా రూ. 6499, రూ. 5,999 కాగా రెండింటిపై ప్రారంభ ఆఫర్ కింద రూ.1,999కే  అందుబాటులో ఉన్నాయి.  ఫ్లిప్‌కార్ట్ , కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వైజ్ క్రెస్ట్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో వస్తే.. వైజ్ స్టడ్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us