Jio Network: భారతదేశంలో అగ్రస్థానంలో జియో నెట్‌వర్క్.. 9 అవార్డులు సొంతం
రిలయన్స్ జియో వేగంగా విస్తరిస్తోంది. యూజర్లకు మెరుగైన నెట్‌వర్క్ అనుభవం అందించే విధంగా ముందుకు కదులుతోంది. ఎయిర్‌టెల్ కంటే జియో తన సత్తా చాటుతోంది. 5G నెట్‌వర్క్‌లతో సహా మొబైల్ నెట్‌వర్క్‌ల కోసం మొత్తం తొమ్మిది అవార్డులను గెలుచుకోవడం ద్వారా రిలయన్స్ జియో భారతదేశంలో అగ్ర టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. ఈ అద్భుతమైన నెట్‌వర్క్ కలిగి ఉండి ప్రపంచవ్యాప్తంగా..

ప్రస్తుతం దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశంలో 4జీ నెట్‌వర్క్ కొనసాగుతుండగా, ఇటీవల 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే నెట్‌వర్క్ విషయంలో రిలయన్స్ జియో వేగంగా విస్తరిస్తోంది. కస్టమర్లను పెంచుకోడంతో పాటు వివిధ రకాల ఆఫర్లను కల్పిస్తూ చౌకైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక 5జీ నెట్ వర్క్ విషయంలో రిలయన్స్ జియో వేగంగా విస్తరిస్తోంది. యూజర్లకు మెరుగైన నెట్‌వర్క్ అనుభవం అందించే విధంగా ముందుకు కదులుతోంది. ఎయిర్‌టెల్ కంటే జియో తన సత్తా చాటుతోంది. 5G నెట్‌వర్క్‌లతో సహా మొబైల్ నెట్‌వర్క్‌ల కోసం మొత్తం తొమ్మిది అవార్డులను గెలుచుకోవడం ద్వారా రిలయన్స్ జియో భారతదేశంలో అగ్ర టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది.
ఈ అద్భుతమైన నెట్‌వర్క్ కలిగి ఉండి ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ ప్రొవైడర్లకు ప్రపంచ ప్రమాణాన్ని సెట్ చేస్తుంది. రిలయన్స్ జియోకు లభించిన ప్రశంసల్లో “ఉత్తమ మొబైల్ నెట్‌వర్క్, వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్, ఉత్తమ మొబైల్ కవరేజ్, అత్యున్నత స్థాయి మొబైల్ నెట్‌వర్క్, ఉత్తమ మొబైల్ వీడియో అనుభవం,ఉత్తమ మొబైల్ గేమింగ్ అనుభవం, వేగవంతమైన 5G మొబైల్” ఉన్నాయి.
5G నెట్‌వర్క్‌ల కు సంబంధించిన అన్ని అవార్డులతో సహా మార్కెట్లో మొబైల్ నెట్‌వర్క్‌ల కోసం మొత్తం తొమ్మిది అవార్డులను గెలుచుకున్న జియో భారతదేశంలో నెం.1 నెట్‌వర్క్‌గా అవతరించింది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఏ సర్వీస్ ప్రొవైడర్‌కైనా ఉపయోగపడుతుంది,” ప్రముఖ నెట్‌వర్క్ టెస్టింగ్ సంస్థ అని ఓక్లా ఒక ప్రకటనలో తెలిపింది. 5G మొబైల్ నెట్‌వర్క్ పనితీరు పరంగా, రిలయన్స్ జియో 335.75 ఆకట్టుకునే స్కోర్‌ను సాధించింది. దాని ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ 179.49 స్కోర్ తో చాలా వెనుకబడి ఉంది.
జియో 5G వినియోగదారులు 416.55Mbps మధ్యస్థ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అనుభవించారు. ఇక ఎయిర్‌టెల్ 213.3Mbpsని అధిగమించింది. అలాగే ఎయిర్‌టెల్19.83తో పోల్చితే 21.20Mbps మధ్యస్థ అప్‌లోడ్ జియో వేగంతో ఉంది. రిలయన్స్ జియో షెడ్యూల్ కంటే ముందే బలమైన ట్రూ 5G నెట్‌వర్క్‌తో దేశం మొత్తాన్ని కవర్ చేసింది. వారు 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 85% విస్తరించింది.
జియోకు ఎందులోను 9 అవార్డులు అంటే..
• ఉత్తమ మొబైల్ నెట్‌వర్క్ • వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్ • ఉత్తమ మొబైల్ కవరేజ్ • టాప్ రేటెడ్ మొబైల్ నెట్‌వర్క్ • ఉత్తమ మొబైల్ వీడియో అనుభవం • ఉత్తమ మొబైల్ గేమింగ్ అనుభవం • వేగవంతమైన 5G మొబైల్ నెట్‌వర్క్ • ఉత్తమ 5G మొబైల్ వీడియో అనుభవం • ఉత్తమ 5G మొబైల్ గేమింగ్ అనుభవం
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి