FD Interest Rates: ఆ మూడు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీల జాతర.. అధిక వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులివే..
బ్యాంకులు కూడా ఎఫ్‌డీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అదిరిపోయే వడ్డీలను అందిస్తాయి. ఎఫ్‌డీల్లో పెట్టుబడి వల్ల మంచి వడ్డీ రేటు వచ్చిన్నా పెట్టుబడి మాత్రం నమ్మకమై బ్యాంకుల్లో చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో నమ్మకమైన బ్యాంకుల్లా ఉన్న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఎఫ్‌డీలపై రూ. 2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై ఎంత వడ్డీ ఇస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ప్రస్తుత సమాజంలో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన ఆస్తిపాస్తుల డబ్బే మన బంధాలను దగ్గర చేస్తుంది. అయితే భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువ అని అందరికీ తెలిసిందే. అందువల్ల వాళ్లు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆ పెట్టుబడులు సమయానుగుణంగా మెచ్యూరైతే ఆ సొమ్మును భవిష్యత్ కోసం ఎఫ్‌డీ వంటి పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా ఎఫ్‌డీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అదిరిపోయే వడ్డీలను అందిస్తాయి. ఎఫ్‌డీల్లో పెట్టుబడి వల్ల మంచి వడ్డీ రేటు వచ్చిన్నా పెట్టుబడి మాత్రం నమ్మకమై బ్యాంకుల్లో చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో నమ్మకమైన బ్యాంకుల్లా ఉన్న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఎఫ్‌డీలపై రూ. 2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై ఎంత వడ్డీ ఇస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
- ఏడు రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు మూడు శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు నాలుగు శాతం
- 46 రోజుల నుంచి ఆరు నెలల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
- 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువ వ్యవధి ఉన్న డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీను అందిస్తున్నారు.
- 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
- 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు – 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
- 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు – 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతంవడ్డీను అందిస్తున్నారు.
- అలాగే ఐదు సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీను అందిస్తున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
- ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
- 180 రోజుల నుంచి 270 రోజుల వర్కు సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
- 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు 5.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.30 శాతం
- 1 సంవత్సరం 443 రోజుల వ్యవధి వరకూ సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
- 444 రోజులు రెండేళ్ల వరకూ సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పైన డిపాజిట్లను సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
- 46 రోజుల నుంచి 179 రోజులు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం
- 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వ్యవధి వరకూ సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి