JIO: జియో యూజర్లకు బంపరాఫర్.. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఉచితంగా ఓటీటీ సేవలు..
రూ. 3,227తో జియో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 365 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌తో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను పొందొచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటాను పొందొచ్చు. దీంతో పాటు యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు ఈ రీఛార్జ్ చేసుకుంటే జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి సేవలను పొందొచ్చు. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ లేకుండా...

టెలికం రంగంలో సరికొత్త విప్లవంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో రోజురోజుకీ యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఆఫర్లతో వినియోగదారులను తనవైపు తిప్పుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్స్‌ను అందించిన జియో తాజాగా ఓటీటీ లవర్స్ కోసం కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇంతకీ ఈ ప్లాన్ ఏంటి.? దీంతో కలిగే బెనిఫిట్స్ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 3,227తో జియో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 365 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌తో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను పొందొచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటాను పొందొచ్చు. దీంతో పాటు యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు ఈ రీఛార్జ్ చేసుకుంటే జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి సేవలను పొందొచ్చు. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ లేకుండా సోనీ లివ్, జీ5 పొందాలనుకుంటే.. రూ. 3,662తో రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే రూ. 3,178 ప్లాన్‌తో డిస్నీ+హాట్‌స్టార్ పొందొచ్చు.
ఓటీటీతో వస్తున్న మరికొన్ని రీఛార్జ్ ప్లాన్స్..
* రూ. 3,226 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. 365 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు సోనీ లివ్, జీ5 ఓటీటీలను పొందొచ్చు. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సేవలను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
* జియో అందిస్తున్న మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ. 3226 ఒకటి. 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌తో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు సోనీ లివ్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌తో పాటు జీ5 ఓటీటీలను పొందొచ్చు.
* జియో రూ. 3,225 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అవకాశం ఉంటుంది. వీటితో పాటు జీ5, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, సోనీలివ్ ఓటీటీలను ఉచితంగా పొందొచ్చు.
* జియో రూ. 2545 ప్లాన్ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 1.5 జీబీ డేటాను పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. వీటితో పాటు జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ వంటి సేవలను ఉచితంగా పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..