Indigo AI Chatbot: తెలుగులో మాట్లాడే ‘ఏఐ చాట్‌బాట్’తో టికెట్ బుకింగ్.. ఇండిగో సరికొత్త ఆవిష్కరణ.. పూర్తి వివరాలు ఇవి..
మన దేశంలో కూడా అనేక సంస్థలు ఏఐని అందిపుచ్చుకుంటున్నాయి. ఈ జాబితాలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కూడా చేరింది. ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగదారులకు సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తోంది. అందుకోసం సరికొత్తగా ఏఐ చాట్ బాట్(AI chatbot)ను తీసుకొచ్చింది. దీనికి 6 ఎస్కై(6Eskai) పేరు పెట్టింది.

ప్రపంచ ప్రయాణం ఆర్టిఫీషియల్ ఇంటెలెజెన్స్(ఏఐ)కు అనుసంధానమై సాగిపోతోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈ కృత్రి మేధస్సును వినియోగించుకొంటూ ముందుకు సాగుతున్నాయి. మన దేశంలో కూడా అనేక సంస్థలు ఏఐని అందిపుచ్చుకుంటున్నాయి. ఈ జాబితాలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కూడా చేరింది. ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగదారులకు సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తోంది. అందుకోసం సరికొత్తగా ఏఐ చాట్ బాట్(AI chatbot)ను తీసుకొచ్చింది. దీనికి 6 ఎస్కై(6Eskai) పేరు పెట్టింది. దీనిని విమాన టికెట్లు, బుకింగ్ కౌంటర్లో వినియోగించేలా తయారు చేసింది. కౌంటర్లో టికెట్లు ఇవ్వడం మాత్రమే కాక కస్టమర్లు అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇచ్చేలా దీనిని ఆవిష్కరించారు. ఈ చాట్ బాట్ ఏకంగా 10భాషల్లో మాట్లాడగలదని ఆ సంస్థ ప్రకటించింది. ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు వంటి భాషల్లో కస్టమర్లకు సమాధానాలు ఇవ్వగలుగుతుంది. మన దేశంలో ఇలాంటి సేవలందించే చాట్ బాట్ రావడం ఇదే తొలిసారి. మరే ఇతర విమానయాన సంస్థలో కూడా ఇటువంటి సేవలు లేవు. ఇండిగోనే తొలిసారి దీనిని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మైక్రోసాఫ్ట్ అనుసంధానంతో..
ఈ 6 ఎస్కై చాట్ బాట్ ను ఇండిగో డిజిటల్ బృందం సాఫ్టవేర్ టైకూన్ మైక్రోసాఫ్ట్ తో కలిసి రూపొందించింది. దీనిలో జీపీటీ-4(జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్) టెక్నాలజీని వినియోగించారు. టికెట్ కౌంటర్లకు వచ్చే కస్టమర్ల సందేహాలను సులభంగా నివృత్తి చేయడంలో ఈ చాట్ బాట్ ఉపయోగపడుతుందని ఇండిగో ప్రకటించింది. అంతేకాక తమ సర్వీస్ ఏజెంట్లపై 75శాతం వరకూ పనిభారం తగ్గుతుందని వెల్లడించింది. దీనిలో వినియోగదారులు తరచూ అడిగే ప్రశ్నలు, వాటి సమాధానాల వంటివి ఏకంగా 1.7 ట్రిలియన్లకు పైగా వివిధ రకాల అంశాలను జోడించినట్లు చెప్పింది. టెకెట్ బుకింగ్, చెక్ ఇన్, చెక్ అవుట్, సీట్ల ఎంపిక, ఇటిర్నరీ డౌన్ లోడ్, ట్రిప్ ప్లానింగ్, డిస్కౌంట్ కూపన్లను వినియోగించుకోవడం వంటి సర్వీసులు ఈ చాట్ బాట్ సాయంతో పొందొచ్చని ఇండిగో వివరించింది. ఇది ప్రయాణికులకు వారి పని వేగంగా సులభంగా పొందేందుకు వీలుంటుందని వివరించింది.
ఇది ఎలా పని చేస్తుందంటే..
సాధారణంగా చాట్ బాట్ లకు టెక్ట్స్ రూపంలో ప్రశ్నలు ఇస్తే.. అది తిరిగి టెక్ట్స్ రూపంలోనే సమాధానం ఇస్తుంది. అయితే ఈ 6 ఎస్కై చాట్ బాట్ టెక్ట్స్ మాత్రమే కాక, స్పీచ్ ఆప్షన్ ద్వారా వినియోగదారుల నుంచి ప్రశ్నలు స్వీకరిస్తుంది. తిరిగి టెక్ట్స్ రూపంలో అది సమాధానం ఇస్తుంది. ఈ సందర్భంగా ఇండిగో ఐఫ్లై కస్టమర్ ఎక్స్ పీరియన్స్ సీనియర్ వైస్ ప్రెసిడింట్ సుమ్మీ శర్మ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలోనే దీనిని ప్రారంభించామన్నారు. దీని సాయంతో విమాన టికెట్ బుకింగ్ చాలా సులభతరం అవుతుందని చెప్పారు. వినియోగదారుల ప్రశ్నలకు కేవలం సమాధానాలు ఇవ్వడమే కాకుండా సంభాషణల మధ్యలో అచ్చం మనిషిలాగే భావోద్వేగాలను కూడా జోడించి సమాధానాలు ఇస్తుందని చెప్పుకొచ్చారు. దీని సాయంతో కస్టమర్లకు సంతృప్తికర సేవలు అందించడంతో పాటు తమ నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందన్న నమ్మకం ఉందని సుమ్మీ శర్మ అన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..