Ghibli style images: సోషల్ మీడియాలో గిబ్లీ ట్రెండ్.. సింపుల్‌గా రూపొందించండిలా..!
సోషల్ మీడియాలో ప్రస్తుతం గిబ్లీ స్టైల్ చిత్రాలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో ఇవి అప్ డేట్ అవుతూ కనిపిస్తున్నాయి. విద్యార్థులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలందరూ తమ ఫొటోలను గిబ్లీ స్టైల్ లో మార్చుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చాట్ జీపీటీలోని కొత్త ఏఐ పుణ్యమా అని ఈ ట్రెంట్ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు యూజర్లకు గొప్ప శుభవార్త అందింది. ఈ ఫీచర్ ను ఉచితంగా అందిస్తున్నట్టు ఓపెన్ ఏఐ ప్రకటించింది.

ఓపెన్ ఏఐ తన ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ సాధనానికి కొత్త అప్ డేట్ ప్రకటించింది. దీన్ని ఉచితంగా చాట్ జీపీటీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దాని ప్రకారం చాట్ జీపీటీ వినియోగించే వారందరూ సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ తో అద్భుతమైన ఏఐ చిత్రాలను రూపొందించవచ్చు. స్టూడియో గిబ్లీ స్టైల్ లో మీమ్స్, చిత్రాలను తయారు చేయవచ్చు. ఈ లేటెస్ట్ ఫీచర్ ను గతంలో చాట్ జీపీటీ తన ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందించింది. ఈ స్టైల్ విపరీతంగా ట్రెంట్ అవడంతో యూజర్లందరికీ ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంది.
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మాన్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. చాట్ జీపీటీ యూజర్లందరికీ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపాడు. ఈ ప్రకటన ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో నెటిజన్లు తమ రియల్ లైఫ్ ఫోటోలను యానిమేటెడ్ గిబ్లీ తరహా చిత్రాలుగా మార్చడంతో బిజీగా మారారు. ఈ ఫీచర్ ను ఎక్కువగా వినియోగించడం వల్ల జీపీయూల సమస్యలు వస్తున్నాయని సామ్ ఆల్ట్ మన్ ప్రకటించడం దీని డిమాండ్ ను సూచిస్తుంది.
చాట్ జీపీటీలోని ఈ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ను చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని దశలను పాటించడం ద్వారా నచ్చిన విధంగా చిత్రాలను రూపొందించుకోవచ్చు.
- ముందుగా మీ పరికరంలో చాట్ జీపీటీని యాక్సెస్ చేసి, ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- మెసేజ్ ఇన్ పుట్ ప్రదేశంలో మీకు కావాల్సిన చిత్రాన్ని వివరిస్తూ ప్రాంప్ట్ టైప్ చేయాలి. ఉదాహరణకు స్డూడియో గిబ్లీ స్టైల్ లో చెరువు దగ్గర జంతువులు, పక్షులతో తెల్లవారుజామున అందమైన చిత్రం కావాలి అని టైప్ చేయవచ్చు. వెంటనే మీకు అలాంటి చిత్రం జనరేట్ అవుతుంది. మీరు ఎంత వివరంగా టైప్ చేస్తే అంత స్పష్టంగా ఇమేజ్ తయారవుతుంది.
- చిత్రం రంగులను కూాడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
- చిత్రం తయారైన తర్వాత దాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- మీరు, కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా గిబ్లీ స్లైల్ లోకి మార్చుకోవచ్చు. చాట్ ప్రాంప్ట్ ప్రాంతంలోని ప్లస్ గుర్తును క్లిక్ చేయడం మీ ఫొటోను అప్ డేట్ చేసుకోవచ్చు.
- గిబ్లీ దిస్, టర్న్ దిస్ ఇమేజ్ ఇన్ స్డూడియో గిబ్లీ థీమ్ అనే టైప్ చేయవచ్చు.
- వెంటనే మీరు గిబ్లీ చిత్రం పొందుతారు. దాన్ని మీ పరికరంలోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి