మా ఆయనే బిగ్ బాస్ విన్నర్.. వితిక జోస్యం!
బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ ఫైనల్‌కు చేరింది. మరో ఐదు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది తేలిపోనుంది. గత వారం యాంకర్ శివజ్యోతి ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరు టైటిల్ గెలవనున్నారనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ వితిక షేరు […]
బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ ఫైనల్‌కు చేరింది. మరో ఐదు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది తేలిపోనుంది. గత వారం యాంకర్ శివజ్యోతి ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరు టైటిల్ గెలవనున్నారనే దానిపై చర్చ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ వితిక షేరు బిగ్ బాస్ విజేత ఎవరవుతారో చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త వరుణ్ సందేశ్ ఖచ్చితంగా టైటిల్ గెలుచుకుంటాడని.. ఆ నమ్మకం తనకుందని చెప్పుకొచ్చింది. టాస్కుల్లో వరుణ్ తనకంటే బాగా ఆడేవాడన్న వితిక.. ప్రేక్షకులు వరుణ్‌ను సోలోగానే ఆడటానికి ఇష్టపడుతున్నారని చెప్పింది. బిగ్ బాస్ వల్ల చాలా నేర్చుకున్నానని.. లగ్జరీ లేకుండా, సోషల్ మీడియా లేకుండా బతకవచ్చుననే నమ్మకం కలిగిందని వితిక తెలిపింది. మరి వితిక కోరిక నిజమవుతుందో లేదో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే.