‘బిగ్‌బాస్’ ఫైనల్‌కు ఇస్మార్ట్ అందాలు..! ఫ్యాన్స్‌లో హీట్ పుట్టిస్తున్న రూమర్

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతోన్న బిగ్‌బాస్ 3 ఫైనల్‌కు వచ్చేసింది. ఈ వారంలో ‘బిగ్‌బాస్’ విన్నర్ ఎవరో తేలనుంది. ఇక నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ సీజన్‌  ఫైనల్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని.. ఆయనే విన్నర్‌ను ప్రకటిస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇలాంటి నేపథ్యంలో ‘బిగ్‌బాస్’ ఫైనల్‌కు సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. ఫైనల్‌లో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:20 am, Wed, 30 October 19
'బిగ్‌బాస్' ఫైనల్‌కు ఇస్మార్ట్ అందాలు..! ఫ్యాన్స్‌లో హీట్ పుట్టిస్తున్న రూమర్

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతోన్న బిగ్‌బాస్ 3 ఫైనల్‌కు వచ్చేసింది. ఈ వారంలో ‘బిగ్‌బాస్’ విన్నర్ ఎవరో తేలనుంది. ఇక నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ సీజన్‌  ఫైనల్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని.. ఆయనే విన్నర్‌ను ప్రకటిస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇలాంటి నేపథ్యంలో ‘బిగ్‌బాస్’ ఫైనల్‌కు సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. ఫైనల్‌లో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సందడి చేయబోతుందట.

ఫైనల్ ఎపిసోడ్‌ ప్రారంభంలో నిధి తన టీమ్‌తో పది నిమిషాల పాటు డ్యాన్స్ చేయబోతున్నట్లు టాక్. ప్రతిసారిలాగే ఫైనల్ ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా ముగించి ప్రేక్షకులకు కన్నుల విందు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ క్రమంలో నిధితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలీకపోయిగా.. ఈ రూమర్‌ మాత్రం ఆమె ఫ్యాన్స్‌లో హీట్ పుట్టిస్తోంది. కాగా ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్‌లు ఉన్నారు. వారందరి మధ్య ప్రస్తుతం టఫ్ ఫైట్ నడుస్తోంది. ఫైనల్‌కు వెళ్లి.. టైటిల్‌ను గెలవాలని వారందరూ ఆరాట పడుతున్నారు. ఇక వీరిలో ప్రేక్షకులు ఎవరిని విన్నర్‌గా చేస్తారోనన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.