AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boult Craft Smartwatch: డిఫరెంట్ డిజైన్.. కిర్రాక్ ఫీచర్స్.. అతి తక్కువ ధర.. బౌల్ట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ అదిరిపోయింది..

గత వారంలోనే బౌల్ట్ నుంచి వై1 ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ మార్కెట్లోకి రాగా.. ఈ వారంలో ఈ స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చింది. దీనిలో పెద్ద డిస్ ప్లే ఉంటుంది. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. పలు హెల్త్ ట్రాకర్లతో పాటు అడ్వాన్స్ డ్ ఫీచర్ల ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ బౌల్ట్ క్రాఫ్ట్ స్మార్ట్ వాచ్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Boult Craft Smartwatch: డిఫరెంట్ డిజైన్.. కిర్రాక్ ఫీచర్స్.. అతి తక్కువ ధర.. బౌల్ట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ అదిరిపోయింది..
Boult Craft Smartwatch
Madhu
|

Updated on: Sep 23, 2023 | 12:57 PM

Share

యువత దగ్గర నుంచి పెద్ద వారి వరకూ అందరూ వినియోగిస్తున్న టెక్ గ్యాడ్జెట్ స్మార్ట్ వాచ్. ప్రస్తుతం ట్రెండీ ఐటెం ఇదే. అన్ని కంపెనీల నుంచి స్మార్ట్ వాచ్ విభిన్న డిజైన్లు, మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ఇదే క్రమంలో బౌల్ట్ కంపెనీ కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. బౌల్ట్ క్రాఫ్ట్ పేరుతో దీనిని మన దేశంలో ఆవిష్కరించింది. గత వారంలోనే బౌల్ట్ నుంచి వై1 ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ మార్కెట్లోకి రాగా.. ఈ వారంలో ఈ స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చింది. దీనిలో పెద్ద డిస్ ప్లే ఉంటుంది. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. పలు హెల్త్ ట్రాకర్లతో పాటు అడ్వాన్స్ డ్ ఫీచర్ల ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ బౌల్ట్ క్రాఫ్ట్ స్మార్ట్ వాచ్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బౌల్ట్ క్రాఫ్ట్ స్మార్ట్ వాచ్ స్పెక్స్..

ఈ కొత్త స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాల హెచ్ డీ టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్ 240*284 పిక్సల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. 500 నిట్స్ బ్రైట్ నెస్ తో మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో 150 కిపైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్ అందుబాటులో ఉంటాయి. పలు యూఐ థీమ్స్ కి సపోర్టు చేస్తుంది.

ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తుంది. స్మార్ట్ వాచ్ చాలా సులభంగా మీ డివైజ్ కనెక్ట్ అవుతుంది. దీనిలో ఇన్ బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫిట్ నెస్ ట్రాకర్ల విషయానికి వస్తే ఈ బౌల్ట్ క్రాఫ్ట్ స్మార్ట్ వాచ్ లో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. పూర్తిస్థాయిలో హెల్త్ మోనిటరింగ్ చేస్తుంది. స్లీప్ ట్రాకింగ్, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలో, బీపీ మోనిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఫీచర్లకు అదనంగా ఏఐ అసిస్టెంట్స్ తో కూడిన సెడెంటరీ, డ్రింక్ వాటర్ రిమైండర్స్, వాతావరణ అప్ డేట్లు, ఫోన్ ను కనుగొనడానికి అవసరమైన సాంకేతికతతో వస్తుంది. ఈ ఫీచర్లు ప్రతి రోజూ జీవితంలో మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి.

ఈ బౌల్ట్ క్రాఫ్ట్ స్మార్ట్ వాచ్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. కేవలం రూ. 36.5 గ్రాములు బరువు మాత్రమే ఉంటుంది. ఇది ఐపీ 68 రేటింగ్ తో వాటర్, డస్ట్ ప్రూఫ్ గా ఉంటుంది. దీనిలోని బ్యాటరీ కూడా అధిక సామర్థ్యంతో వస్తుంది. సింగిల్ చార్జ్ తో ఏకంగా 7 రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.

ధర, లభ్యత..

ఈ బౌల్ట్ క్రాఫ్ట్ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం ప్రాంరంభ ఆఫర్ కింద రూ. 1,199కే లభ్యమవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ కోబాల్ట్ బ్లూ, గ్రేప్ పర్పల్, స్పోకీ వైట్, టార్మాక్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. స్టైలిష్ వాచ్ బౌల్ట్ అధికారిక వెబ్ సైట్తో పాటు ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..