AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Fraud: ఫోన్ నంబర్ అప్ డేట్ చేయకపోవడమే పాపం.. రూ. 57లక్షలకు కుచ్చుటోపీ.. ఎంత చాకచక్యంగా కొట్టేశారో తెలుసా..

ఇటీవల ఓ ఎన్ఆర్ఐ ఖాతాను ఇలాగే హ్యాక్ చేసిన స్కామర్లు ఆయన ఖాతా నుంచి రూ. 57లక్షలను కాజేశారు. దీనికి ప్రధాన కారణం ఆయన తన బ్యాంకు అకౌంట్ కు లింక్ చేసి ఫోన్ నంబర్ ను అప్ డేట్ చేయకపోవడమే! అవునండి కేవలం ఫోన్ నంబర్ తోనే స్కామర్లు అకౌంట్ మొత్తాన్ని హ్యాక్ చేసేశారు. అదేంటి ఫోన్ నంబర్ అప్ డేట్ చేయకపోతే.. చోరీ ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి..

Online Fraud: ఫోన్ నంబర్ అప్ డేట్ చేయకపోవడమే పాపం.. రూ. 57లక్షలకు కుచ్చుటోపీ.. ఎంత చాకచక్యంగా కొట్టేశారో తెలుసా..
Online Fraud
Madhu
|

Updated on: Sep 23, 2023 | 11:27 AM

Share

ఆన్ లైన్ నేరాలు మన దేశంలో భారీగా పెరిపోతున్నాయి. అందివస్తున్న సాంకేతికతో స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు వెతుక్కుంటూ చోరీలకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే తరహా నేరాలు వెలుగుచూస్తున్నాయి. కేవలం భారతీయులను మాత్రమే కాక.. ఇక్కడ పుట్టి, చదువుకొని ఉద్యోగాల రీత్యా విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలనూ స్కామర్లు వదలడం లేదు. ఇటీవల ఓ ఎన్ఆర్ఐ ఖాతాను ఇలాగే హ్యాక్ చేసిన స్కామర్లు ఆయన ఖాతా నుంచి రూ. 57లక్షలను కాజేశారు. దీనికి ప్రధాన కారణం ఆయన తన బ్యాంకు అకౌంట్ కు లింక్ చేసి ఫోన్ నంబర్ ను అప్ డేట్ చేయకపోవడమే! అదేంటి ఫోన్ నంబర్ అప్ డేట్ చేయకపోతే.. చోరీ ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి..

బ్యాంకు మేనేజరే సూత్రధారి..

లుధియానాలోని హెచ్ డీ ఎఫ్సీ బ్రాంచ్ లో ఎన్నారై రమణదీప్ గ్రేవాల్ కు ఖాతా ఉంది. ఈ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు రూ. 57లక్షలను కాజేశారు. ఈ మేరకు లుథియాన పోలీసులు కేసు నమోదు చేసి, అసలు స్కామర్లను అరెస్ట్ చేశారు. కేసులో అసలు సూత్రధారి హెచ్ డీ ఎఫ్సీ బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్ సుఖ్ జిత్ సింగ్ గుర్తించారు. ఈయనతోపాటు బీహార్ కు చెందిన లవ్ కుమార్, గజియాపూర్ కు చెందిన నిలేష్ పాండే, ఢిల్లీకి చెందిన అభిషేక్ అను అరెస్ట్ చేశారు. ఇంకో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

స్కామ్ ఎలా జరిగిందంటే..

ఎన్నారై రమణదీప్ గ్రేవాల్ యూకే ఉంటారు. ఆయనకు లుధియానాలో హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ లో ఖాతా ఉంది. అయితే ఆయన చాలా కాలంగా ఆ ఆఖాతాకు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నంబర్ ను అప్ డేట్ చేయలేదు. దీంతో అది డీయాక్టివేట్ అయిపోయింది. దీనిని అదునుగా తీసుకున్న ఆ బ్యాంకు రిలేషన్ షిప్ మేనేజర్ సుఖ్ జీత్ సింగ్ కొంత మంది స్కామర్లతో కలిసి వ్యక్తుల నంబర్ ను దానికి అనుసంధానించారు. ఇది చేసినందుకు కానూ బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్ సుఖ్ జీత్ సింగ్ కు రూ. 14లక్షలు తీసుకున్నారు. ఫలితంగా ఎన్నారై అకౌంట్ నంబర్ తో పాటు అకౌంట్ యాక్సెస్ మొత్తం స్కామర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో వారు ఓటీపీలు వినియోగించి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అకౌంట్ కు లింక్ చేసిన ఈ-మెయిల్ ను కూడా మార్చేశారు. అనంతరం ఎన్నారై ఖాతాకు బెనిఫీషియరీలను యాడ్ చేసి దాని ద్వారా రూ. 57లక్షలకు పైగా పంపించేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

తన ఖాతా నుంచి డబ్బులు మాయమవుతున్నట్లు గుర్తించిన ఎన్నారై గ్రేవాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నలుగురి కోసం గాలింపు చేపట్టారు. నిందితుల నుంచి రూ. 17.35 లక్షలను రికరీ చేయడంతో పాటు వివిధ బ్యాంక్ ఖాతాల్లోని రూ. 7.24లక్షల మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. అలాగే యాపిల్ మ్యాక్ బుక్, నాలుగు సెల్ ఫోన్లు, ఎనిమిది ఏటీఎం కార్డులు, మూడు చెక్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో పోలీసులు మిగిలిన వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీ ఫోన్ నంబర్ మారినా.. కొత్త నంబర్ తీసుకున్నా.. బ్యాంకులో కూడా అప్ డేట్ చేసుకోవాలని లేకపోపతే ఆన్ లైన్ మోసాలకు బలికావాల్సి వస్తుందని చెప్పారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు