AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Tips: కారు చక్రాలలో రంధ్రాలు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!

Auto Tips: చక్రాల రిమ్స్‌లో రంధ్రాలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం బరువు తగ్గించడం. చక్రాల రిమ్‌లు సాధారణంగా లోహంతో తయారు చేస్తారు. ఇది బలానికి చాలా అవసరం. రంధ్రాలు చేయడం వల్ల మెటల్ డిస్క్ బరువు గణనీయంగా తగ్గుతుంది. అందువల్ల డిస్క్‌లో..

Auto Tips: కారు చక్రాలలో రంధ్రాలు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
Subhash Goud
|

Updated on: Nov 25, 2025 | 3:35 PM

Share

Auto Tips: కారు చక్రాలు (చక్రాల అంచులు) చిన్న రంధ్రాలు ఉండటం మీరు చూసే ఉంటారు. కానీ ఈ రంధ్రాలు ఎందుకు ఉన్నాయో.. వాటి ఉద్దేశ్యం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది ఈ రంధ్రాలు కేవలం లుక్స్ కోసమే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ రంధ్రాలకు అసలు కారణం భిన్నంగా ఉంటుంది. ఈ రంధ్రాలు చాలా ముఖ్యమైనవి. ఈ రంధ్రాలు డిజైన్‌లో భాగం కాదు, వాటి వెనుక అనేక ముఖ్యమైన ఇంజనీరింగ్, భద్రతా కారణాలు ఉన్నాయి.

బరువు తగ్గడానికి..

చక్రాల రిమ్స్‌లో రంధ్రాలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం బరువు తగ్గించడం. చక్రాల రిమ్‌లు సాధారణంగా లోహంతో తయారు చేస్తారు. ఇది బలానికి చాలా అవసరం. రంధ్రాలు చేయడం వల్ల మెటల్ డిస్క్ బరువు గణనీయంగా తగ్గుతుంది. అందువల్ల డిస్క్‌లో రంధ్రాలు చేస్తారు. ఇది డిస్క్ బలాన్ని కొనసాగిస్తూ బరువును తగ్గిస్తుంది. చక్రం బరువును తగ్గించడం వలన వాహనం మొత్తం బరువు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. తేలికైన చక్రాలు ఇంధన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: December Bank Holidays: డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులకు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..

వాహనం చక్రం తిరిగేటప్పుడు దాని సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ రంధ్రాలు చాలా అవసరం. చక్రం బరువు సమానంగా ఉండకపోతే అది అధిక వేగంతో షేక్‌ అవుతుంటుంది. అందువల్ల సమాన బరువును నిర్వహించడానికి ఈ రంధ్రాల చాలా ముఖ్యమంటున్నారు.

బ్రేక్‌లను చల్లబరుస్తుంది:

డిస్క్‌ల వెనుక బ్రేక్‌లు ఉంటాయి. ఇవి వాహనాన్ని ఆపడానికి అవసరం. కారును ఆపడానికి బ్రేక్‌లను నొక్కినప్పుడు బ్రేక్ ప్యాడ్‌లు, డిస్క్‌లు ఘర్షణ కారణంగా చాలా వేడిగా మారుతాయి. ఈ వేడిని విడుదల చేయకపోతే బ్రేక్‌లు విఫలమవుతాయి. అందువల్ల, ఈ వేడిని విస్తరించడానికి వెంట్లు చాలా ముఖ్యమైనవి. ఈ వెంట్లు బ్రేక్ సిస్టమ్‌కు చల్లని గాలిని సరఫరా చేస్తాయి. అదనపు వేడిని త్వరగా బయటకు వెళ్లేలా చేస్తాయి. బ్రేకింగ్ సిస్టమ్ ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతాయి. బ్రేక్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి.

నీరు, ధూళిని తొలగించడం:

వీల్ రిమ్‌లోని ఈ రంధ్రాలు నీరు, ధూళిని తీసివేయడానికి కూడా సహాయపడతాయి. వర్షంలో లేదా బురద రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు వీల్‌పై నీరు, ధూళి పేరుకుపోతాయి. ఇది సాధారణం. అయితే వాటిని శుభ్రం చేయకపోతే అవి వీల్ రిమ్‌ను దెబ్బతీస్తాయి. ఈ రంధ్రాలు చక్రం తిరుగుతున్నప్పుడు నీరు,ధూళిని తీసివేయడానికి సహాయపడతాయి. ఇది వీల్‌లో తేమ పేరుకుపోకుండా నిరోధిస్తుంది.తుప్పు పట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదనంగా ఇది బ్రేక్ ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అలాగే బ్రేకింగ్ పనితీరును ప్రభావితం చేయదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి