AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki EV: మారుతి సుజుకి నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు.. లాంచ్‌ తేదీ ఎప్పుడో తెలుసా?

Maruti Suzuki ఇప్పటికే టాటా, మహీంద్రా, MG వంటి కంపెనీలు ఇప్పటికే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తుండగా, మారుతి ఇంకా EV విభాగంలోకి ప్రవేశించాయి. ఇప్పుడు మారుతి ప్రవేశించనుంది. 2030 నాటికి భారతదేశంలో 50% మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా..

Maruti Suzuki EV: మారుతి సుజుకి నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు.. లాంచ్‌ తేదీ ఎప్పుడో తెలుసా?
Subhash Goud
|

Updated on: Nov 25, 2025 | 3:11 PM

Share

Maruti Suzuki EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెట్రోల్ లేదా డీజిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్‌ వాహనాలు రాగా, ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. దీనికి మారుతి సుజుకి eVitara అని పేరు పెట్టారు. eVitara డిసెంబర్ 2, 2025న ప్రారంభించనుంది.

మారుతి సుజుకి అధికారికంగా ఈ-విటారాను డిసెంబర్ 2, 2025న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే టాటా, మహీంద్రా, MG వంటి కంపెనీలు ఇప్పటికే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తుండగా, మారుతి ఇంకా EV విభాగంలోకి ప్రవేశించాయి. ఇప్పుడు మారుతి ప్రవేశించనుంది. 2030 నాటికి భారతదేశంలో 50% మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం మారుతి దాదాపు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఎనిమిది కొత్త EV, హైబ్రిడ్ మోడళ్లను విడుదల చేస్తోంది.

ఇది కూడా చదవండి: December Bank Holidays: డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులకు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..

ఇవి కూడా చదవండి

మారుతి eVitaraకు ముందు భాగంలో 3-పాయింట్ మ్యాట్రిక్స్ LED DRLలు, స్టైలిష్‌ LED హెడ్‌ల్యాంప్‌లు, క్లోజ్డ్ గ్రిల్ ఉన్నాయి. ఇది దీనికి ఆధునిక ఎలక్ట్రిక్ లుక్‌ను ఇస్తుంది. ఈ డిజైన్ యువత, కుటుంబాలు, ఈవీ ఔత్సాహికులను ఆకర్షిస్తుంది. e-Vitara క్యాబిన్ ఇప్పటివరకు మారుతి కారులో అత్యంత ప్రీమియం కారు. ఇది డ్యూయల్ డిజిటల్ స్క్రీన్ సెటప్ (ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్) కలిగి ఉంది. ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ దీనికి హైటెక్ అనుభూతిని ఇస్తుంది. మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, OTA అప్‌డేట్‌లు, ప్రీమియం సీట్లు, గ్లాస్ సన్‌రూఫ్ వంటి లక్షణాలు దాని లోపలి భాగాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

61 kWh బ్యాటరీ నుండి 500 కి.మీ పరిధి:

eVitara పెద్ద 61 kWh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది దాదాపు 500 కి.మీ.ల పరిధిని ఇస్తుంది.ఇది ఒకే మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది. FWD కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. eVitara భద్రత పరంగా గణనీయమైన అప్‌గ్రేడ్‌ను పొందుతుంది. ఇందులో లెవల్-2 ADAS, లేన్-కీప్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా ఇది ఏడు ఎయిర్‌బ్యాగులు, ESC, హిల్ హోల్డ్, 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి