AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

December Bank Holidays: డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులకు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..

December Bank Holidays: దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులకు మొత్తం 18 బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. ఈ డిసెంబర్‌లో క్రిస్మస్‌కు సాధారణ సెలవు ఉంటుంది. ఇతర రోజులలో వివిధ ప్రాంతీయ సెలవులు కూడా..

December Bank Holidays: డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులకు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..
Subhash Goud
|

Updated on: Nov 25, 2025 | 3:40 PM

Share

December 2025 Bank Holidays: ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లేవారు చాలా మంది ఉంటారు. అయితే ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది రిజర్వ్‌ బ్యాంకు. ప్రతి రోజు బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు జరిపే వారు నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వచ్చే నెల డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులకు మొత్తం 18 బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. ఈ డిసెంబర్‌లో క్రిస్మస్‌కు సాధారణ సెలవు ఉంటుంది. ఇతర రోజులలో వివిధ ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి.

డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు జాబితా:

  • డిసెంబర్ 1, సోమవారం: రాష్ట్ర అవతరణ దినోత్సవం (అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో సెలవు)
  • డిసెంబర్ 3, బుధవారం: సెయింట్ జేవియర్ పండుగ (గోవాలో సెలవుదినం)
  • డిసెంబర్ 7: ఆదివారం సెలవు
  • డిసెంబర్ 12, శుక్రవారం: ప టోగన్ నెంగ్జింజ సంగ్మా పుణ్యతిథి (మేఘాలయ రాష్ట్రంలో సెలవుదినం)
  • డిసెంబర్ 13: రెండవ శనివారం సెలవు
  • డిసెంబర్ 14: ఆదివారం సెలవు
  • డిసెంబర్ 18, గురువారం: ఉసోసో థామ్ పుణ్యతిథి (మేఘాలయ రాష్ట్రంలో సెలవు)
  • డిసెంబర్ 19, శుక్రవారం: గోవా విముక్తి దినోత్సవం (గోవాలో సెలవు)
  • డిసెంబర్ 20, శనివారం: లూసూంగ్, నామ్సూంగ్ పండుగ (సిక్కింలో సెలవు)
  • డిసెంబర్ 21: ఆదివారం సెలవు
  • డిసెంబర్ 22, సోమవారం: లుసూంగ్, నామ్సూంగ్ పండుగ (సిక్కింలో సెలవు)
  • డిసెంబర్ 24, బుధవారం: క్రిస్మస్ ఈవ్ (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలలో సెలవు)
  • డిసెంబర్ 25, గురువారం: క్రిస్మస్, అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
  • డిసెంబర్ 26, శుక్రవారం: క్రిస్మస్ పండుగ సందర్శంగా(మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలలో సెలవు)
  • డిసెంబర్ 27: నాల్గవ శనివారం సెలవు
  • డిసెంబర్ 28: ఆదివారం సెలవు
  • డిసెంబర్ 30, మంగళవారం: యు కియాంగ్ నంగ్బా పుణ్య తిథి (మేఘాలయలో సెలవు)
  • డిసెంబర్ 31, బుధవారం: నూతన సంవత్సర వేడుక (మిజోరం, మణిపూర్‌లలో సెలవు)

సెలవు దినాల్లో బ్యాంకు కార్యాలయాలు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటుంది. చాలా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రజలు నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించవచ్చు. నగదు అవసరమైన వారి కోసం ATMలు తెరిచి ఉంటాయి. అయితే, చెక్కులు జారీ చేయడానికి, పెద్ద-విలువ RTGS లావాదేవీలు నిర్వహించడానికి వారు బ్యాంకులకు సందర్శించాల్సి ఉంటుంది.

ఈ లింక్ ద్వారా ప్రాంతాల వారీగా బ్యాంకుల సెలవు దినాలను చెక్ చేసుకోండి

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!