Apple iPhones: బడ్జెట్ ఎఫెక్ట్.. దిగొచ్చిన ఐఫోన్ ధరలు.. ఇక అందరికీ అందుబాటులోనే..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దానిలో ఫోన్ల దిగుమతిపై సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఆపిల్ సంస్థ తన ఐఫోన్ల ధరలను తగ్గించింది. దీనివల్ల దేశంలో ఫొన్లు కొనుగోలుదారులకు మేలు జరుగుతుంది.

Apple iPhones: బడ్జెట్ ఎఫెక్ట్.. దిగొచ్చిన ఐఫోన్ ధరలు.. ఇక అందరికీ అందుబాటులోనే..
Iphone
Follow us

|

Updated on: Jul 27, 2024 | 7:06 PM

ఫోన్ల కొనుగోలుదారులకు ఆపిల్ కంపెనీ శుభవార్త చెప్పింది. తన ఐఫోన్ల పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. ఈ కంపెనీ ఫోన్లపై దాదాపు రూ.300 నుంచి రూ.6 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. కొత్తగా ఐఫోన్ ఫోన్ కొనుగోలు చేసేవారికి డబ్బులు ఆదా అవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దానిలో ఫోన్ల దిగుమతిపై సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఆపిల్ సంస్థ తన ఐఫోన్ల ధరలను తగ్గించింది. దీనివల్ల దేశంలో ఫొన్లు కొనుగోలుదారులకు మేలు జరుగుతుంది. ఐఫోన్లకు సాధారణంగా చాలా డిమాండ్ ఉంటుంది. మామూలు ఫోన్లతో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని కొనుగోలు చేయడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం ధరలు తగ్గడంతో ఐఫోన్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

3 నుంచి 4 శాతం తగ్గింపు..

కేంద్ర బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ నిబంధనలకు అనుగణంగా ఆపిల్ తన ఐఫోన్ల ధరను 3 నుంచి 4 శాతం తగ్గించింది. దిగుమతి సుంకం తగ్గడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో డిస్కౌంట్ ధరలతో ఐఫోన్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం ప్రో , ప్రో మాక్స్ మోడల్స్ రూ. 5100 నుంచి రూ. 6 వేలకు తగ్గాయి. అలాగే 13, 14, 15 తో సహా మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు రూ. 300 తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ ఎస్ఈ ధర రూ. 2300 తగ్గింది. మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించిన తర్వాత ఆపిల్ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించింది.

కొనుగోళ్లు పెరిగే అవకాశం..

ఆపిల్ ఫోన్ల ధరలు తగ్గడం వల్ల కొనుగోళ్లు ఊపందుకుంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర తీసుకున్న దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం వల్ల మొబైల్ మార్కెట్ కు కొత్త ఉత్సాహాం వస్తుంది. మొట్టమొదటిసారిగా ఆపిల్ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడంతో గణనీయమైన మార్పు జరుగుతుంది. ముఖ్యంగా కొనుగోళ్లు బాగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఆపిల్ కొత్త వాటిని ప్రారంభించిన తర్వాత పాత ప్రో మోడళ్లను నిలిపివేస్తుంది. ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి డీలర్లు, పునఃవిక్రేతలచే ఎంపిక చేయబడిన డిస్కౌంట్లను మాత్రమే అందిస్తుంది.

కొత్త రేట్లు ఇలా..

తగ్గిన కస్టమ్స్ డ్యూటీతో ఆపిల్ తన ప్రో మోడళ్లకు కొత్త ధర నిర్ణయించింది. దీని ప్రకారం ఐఫోన్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • ఐఫోన్ ఎస్ఈఆర్ రూ.49,900 నుంచి రూ.47,600లకు తగ్గింది.
  • ఐఫోన్ 13 ధర రూ.59,900 నుంచి 59,600కు అందుబాటులోకి వచ్చింది.
  • ఐఫోన్ 14 రూ. 69,900 నుంచి రూ.69,600లకు దిగిపోయింది.
  • ఐఫోన్ 14 ప్లస్ రూ. 79,900 నుంచి రూ.79,600కి అందుబాటులోకి వచ్చింది.
  • ఐఫోన్ 15 రూ. 79,900 నుంచి 79,600 తగ్గింది.
  • ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుంచి రూ.89,600 తగ్గింపు ధరకు లభిస్తుంది.
  • ఐఫోన్ 15 ప్రో రూ.1,34,900 నుంచి 1,29,800లకు తగ్గింది.
  • ఐఫోన్ 15 ప్రోమాక్స్ రూ.1,59,900 నుంచి రూ.1,54,000కు అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బడ్జెట్ ఎఫెక్ట్.. దిగొచ్చిన ఐఫోన్ ధరలు.. ఇక అందరికీ అందుబాటులోనే
బడ్జెట్ ఎఫెక్ట్.. దిగొచ్చిన ఐఫోన్ ధరలు.. ఇక అందరికీ అందుబాటులోనే
బొగత జలపాతాలకు నో ఎంట్రీ.! ఎవరూ రావద్దని ఆంక్షలు..
బొగత జలపాతాలకు నో ఎంట్రీ.! ఎవరూ రావద్దని ఆంక్షలు..
మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా.?అసలు కారణం ఏంటంటే?
మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా.?అసలు కారణం ఏంటంటే?
ఈ తీగలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
ఈ తీగలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
అదిరే లుక్‌లో మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ రిలీజ్..!
అదిరే లుక్‌లో మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ రిలీజ్..!
అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా 4 రైళ్లు
అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా 4 రైళ్లు
ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్
ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్.. వీడియో
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్.. వీడియో
ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..!
ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..!
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..